HomeTelanganaPolitics

రేవంత్ కు చెక్ పెట్టడం కోసం ఉత్తమ్ కు కీలక బాధ్యతలు?

రేవంత్ కు చెక్ పెట్టడం కోసం ఉత్తమ్ కు కీలక బాధ్యతలు?

కర్నాటక‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తర్వాత‌ తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగినప్పటికీ గ్రూపు తగాదాలు మాత్రం తగ్గడంలేదు. పాతవాళ్ళు, కొత్తవాళ్ళ

BRSకు షాక్… GHMC మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లోకి ?
కాంగ్రెస్ తో సీపీఎం క‌టీఫ్… ఒంటరిగా పోటీకి నిర్ణయం
కాంగ్రెస్ లోకి మైనంపల్లి హనుమంత రావు

కర్నాటక‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తర్వాత‌ తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగినప్పటికీ గ్రూపు తగాదాలు మాత్రం తగ్గడంలేదు. పాతవాళ్ళు, కొత్తవాళ్ళ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు రేవంత్ అంటే ఒంటికాలిపై లేచే కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఈ మధ్య రేవంత్ తో సఖ్యతగా ఉంటున్నప్పటికీ, మాజీ పీసీ సీ ఛీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ ల మధ్య మాత్రం అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంది.

ఉత్తమ్ కాంగ్రెస్ ను వీడి బీఆరెస్ లో చేరుతున్నాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం వెఅనక రేవంత్ ఉన్నాడని ఉత్తమ్ భావిస్తున్నారు. ఈ విషయంపై ఆయన అధిష్టానానికి పిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. ఒక్క ఉత్తమ్ మాత్రమే కాకుండా మరింత మంది కాంగ్రెస్ సీనిఅయర్ నేతలతో రేవంత్ కు పొసగడం లేదన్నది కాంగ్రెస్ వర్గాల సమాచారం.

ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కట్ల పంపిణీ విషయంపై సీనియర్ల‌లో గుబులు మొదలయ్యింది. రేవంత్ మెజార్టీ టిక్కట్లు కొత్తవారికి, ప్రధానంగా టీడీపీ నుంచి వచ్చిన వారికి ఇస్తారనే భయం సీనియర్లలో పట్టుకుంది. ఈ విషయంపై పలువురు నాయకులు తరుచూ అధిష్టానానికి పిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రేవంత్ జోరుకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం ఓ స్క్రీనింగ్ కమిటీని నియమించింది. ఆ కమిటీలో రేవంత్ తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా నియమించి రేవంత్ కు షాక్ ఇచ్చింది. అభ్యర్థుల ఎంపిక మొత్తం ఒక్కరి చేతిలోనే ఉండొద్దని, దాని వల్ల బ్యాలెన్స్ తప్పుతుందని భావించిన కాంగ్రెస్ నాయకత్వం రెండు వర్గాలకు ఆ కమిటీలో స్థానం కలిపించింది. అలాగైతే రేవంత్ ఏకపక్ష నిర్ణయాలకు చెక్ పెట్టొచ్చన్నది పార్టీ అధిష్టానం ఆలోచనగా ఉంది.

అయితే ఈ స్క్రీనింగ్ కమిటీ సభ్యుల ఎంపిక కూడా కాంగ్రెస్ పార్టీలో అసంత్రుప్తికి కారణమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఎవరి లిస్ట్ ను వారు సిద్దం చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ సభ్యుల కారణంగా అభ్యర్థుల ఎంపిక సజావుగా సాగబోదని, చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభ్యర్థుల విషయంలో ఈ కమిటీ సభ్యులు ఏకాభిప్రాయానికి రావడం అసాధ్యమని, మళ్ళీ అధిష్టానమే జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.