HomeNational

ఆ మహిళ సోనియా చెవిలో ఏం చెప్పిందో ఊహించగలరా ?

ఆ మహిళ సోనియా చెవిలో ఏం చెప్పిందో ఊహించగలరా ?

ఈ ఫోటో చూసి అందరూ ఆ మహిళ సోనియా గాంధీకి అంత రహస్యంగా ఏం చెప్తున్నదో అని ఆరాలు తీస్తున్నారు. ఇంతకూ ఆ మహిళ సోనియా గాంధీతో మాట్లాడిన విషయమేంటంటే… జూల

హోటల్ లో 6 లక్షల బిల్లు చేసిన ఆంధ్రా మహిళ… ఆమె దగ్గర ఉన్నది 41 రూపాయలే …హోటల్ సిబ్బంది ఏం చేశారు ?
30 పార్టీలు Vs 24 పార్టీలు… దేశంలో వేడి పుట్టిస్తున్న రాజకీయాలు
అమిత్ షా ఒత్తిడితో చివరకు కాసినో కింగ్ చీకోటిని బీజేపీలో చేర్చుకున్నారు

ఈ ఫోటో చూసి అందరూ ఆ మహిళ సోనియా గాంధీకి అంత రహస్యంగా ఏం చెప్తున్నదో అని ఆరాలు తీస్తున్నారు. ఇంతకూ ఆ మహిళ సోనియా గాంధీతో మాట్లాడిన విషయమేంటంటే…

జూలై 8న, రాహుల్ గాంధీ హర్యానాలో రోడ్డుపై వెళ్తూ సోనిపట్‌లోని మదీనా గ్రామంలో ఆకస్మికంగా ఆగారు. అక్కడ స్థానికులతో మమేకమయ్యారు. వ్యవసాయ భూములలో పని చేసే రైతులతో కొద్ది సేపు గడిపారు. వరి నాట్లలో రైతులకు సహకరించి ట్రాక్టర్‌ను కూడా నడిపారు. ఆ సమయంలో వారిని ఎప్పుడైనా ఢిల్లీ చూశారా అని అడిగారు? లేదని వారినుంచి వచ్చిన జవాబు విని ఆ రైతులను, అక్కడున్న మహిళా రైతులను ఢిల్లీకి ఆహ్వానిస్తానని, వారందరికీ ఢిల్లీ చూపిస్తానని హామీ ఇచ్చారు.

తన హామీ మేరకు రాహుల్ గాంధీ ఆ హర్యాణా మహిళా రైతులను ఢిల్లీకి రప్పించారు. సోనియా గాంధీ ఇంటికి ఆహ్వానించారు.
సోనియా గాంధీని కలిసిన మహిళలు ఆమెతో వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. అనేక విషయాలు వాళ్ళు మాట్లాడుకున్నారు. సడెన్ గా ఓ మహిళ సోనియా గాంధీ దగ్గరికి వచ్చి చెవిలో తవ్రగా రాహుల్ గాంధీ పెళ్ళి చేయాలని చెప్పారు. దానికి సోనియా నవ్వుతూ “మీరు అతని కోసం ఒక అమ్మాయిని చూడండి” అని చెప్పారు. దీనిపై రాహుల్‌ నవ్వుతూ ‘అవుతుంది.. అవుతుంది’ అని చెప్పారు. ఈ సందర్భంగా సోనియా ఇంటిలో ఆ మహిళలు లంచ్ చేశారు. రాహుల్ తో కూడా తమ సమ్స్యలు చెప్పుకున్నారు.
ఈ మహిళలతో సోనియా, రాహుల్ తో పాటు ప్రియాంకా గాంధీ కూడా మాట్లాడారు.ప్రియాంక గాంధీ తన బాల్యపు ఙాపకాలను ఆ మహిళలతో పంచుకున్నారు. “రాహుల్ నా కంటే అల్లరే కానీ తిట్లు మాత్రం తనకు బదులుగా నేను తినేదాన్ని” అని అన్నారు.

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ మరణం గురించి మహిళలు సోనియాను అడగ్గా ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో అమ్మ చాలా కుంగుబాటుకు లోనయ్యారని, కొన్ని రోజుల పాటు అన్నం, నీళ్లు ముట్టలేదని ప్రియాంక చెబుతుండగా సోనియా కన్నీటిపర్యంతమయ్యారు. ఆ తర్వాత తేరుకుని మహిళలతో సరదగా ముచ్చటించారు. అనంతరం మహిళా రైతులతో కలిసి సోనియా, ప్రియాంక నృత్యం చేశారు.

ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను రాహుల్‌ తాజాగా సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఆ మహిళలు ముందుగా ఢిల్లీలోని పలు ప్రాంతాలను సందర్శించారు. అనంతరం 10 జన్‌పథ్‌లోని సోనియా నివాసానికి చేరుకున్నారు.