HomeTelanganaNational

21,000 మంది బాలికలకు స్కాలర్‌షిప్స్ ప్రకటించిన మలబార్ గ్రూప్

21,000 మంది బాలికలకు స్కాలర్‌షిప్స్ ప్రకటించిన మలబార్ గ్రూప్

ముంబై, 27 సెప్టెంబర్ 2024: ప్రముఖ భారత వ్యాపార సంస్థ, విభిన్న వ్యాపారాల సమ్మేళనం, మలబార్ గోల్డ్&డైమండ్స్ మాతృ సంస్థ మలబార్ గ్రూప్, ముంబై , BKCలోన

వైసీపీకి షాక్ ఇచ్చిన ముద్రగడ పద్మనాభం
‘కేటీఆర్ భయంతో అనేక మంది హీరోయిన్లు పెళ్ళి చేసుకొని పారిపోయారు’
చంద్రబాబుకు ఊరట – ఒకేసారి మూడు బెయిల్స్ మంజూరు

ముంబై, 27 సెప్టెంబర్ 2024: ప్రముఖ భారత వ్యాపార సంస్థ, విభిన్న వ్యాపారాల సమ్మేళనం, మలబార్ గోల్డ్&డైమండ్స్ మాతృ సంస్థ మలబార్ గ్రూప్, ముంబై , BKCలోని భారత్ డైమండ్ బోర్స్‌లో జరిగిన కార్యక్రమంలో, 2024 సంవత్సరానికి తమ జాతీయ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఇది మలబార్ గ్రూప్ ప్రధాన సామాజిక సేవ కార్యక్రమాల్లో ‘మలబార్ నేషనల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌’ సాధించిన ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ ప్రోగ్రాం బాలికల విద్యకు మద్దతు ఇవ్వడంలో మలబార్ గ్రూపు నిబద్ధతను నొక్కి చెబుతుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర వాణిజ్య , పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. మలబార్ గ్రూప్ ఛైర్మన్ ఎం.పి.అహమ్మద్, అషెర్ ఓ (ఎం.డి – ఇండియా ఆపరేషన్స్ – మలబార్ గ్రూప్), అబ్దుల్ సలామ్ కె.పి (వైస్-ఛైర్మన్ – మలబార్ గ్రూప్), నిషాద్ ఎ.కె (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మలబార్ గ్రూప్) , షౌనక్‌ పారిఖ్ (డైరెక్టర్, మహేంద్ర బ్రదర్స్) మొదలగు వారి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ ఏడాది భారతదేశ వ్యాప్తంగా 21,000 మంది బాలికల విద్యకు మద్దతుగా ₹16 కోట్ల రూపాయలను కేటాయించారు.

మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహమ్మద్ ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, “ఈ ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన సాధనం విద్య. విద్యావకాశాలను విస్తృతం చేయడం, జీవితాలను మార్చడం అనే మలబార్ గ్రూప్ బలమైన నమ్మకానికి ప్రత్యక్ష నిదర్శనం మా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్. సమాజంలో యువతులకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి మేము కట్టుబడి ఉన్నాము, తద్వారా వారు తమ విద్యావకాశాలను మెరుగుపరుచుకుని, తమ ఆకాంక్షలను నెరవేర్చుకుంటారు. సమాజానికి అర్థవంతంగా ఉపయోగపడతారు.” అన్నారు.

మలబార్ గ్రూప్ ప్రారంభించినప్పటి నుండి, తమ సామాజిక సంక్షేమ కార్యకలాపాల ద్వారా సమ్మిళిత వృద్ధికి బలమైన నిబద్ధతను ప్రదర్శించింది. ఈ ప్రయత్నాలను విస్తరించడానికి, 1999 సంవత్సరంలో మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ (MCT) ప్రారంభించబడింది. మలబార్ గ్రూపు లాభాలలో 5% విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలన వంటి సామాజిక సేవా కార్యక్రమాలకు కేటాయిస్తుంది. ముఖ్యంగా సమాజంలో అట్టడుగు వర్గాల సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించింది.

2007లో ప్రారంభించబడిన ‘మలబార్ నేషనల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్’ మలబార్ గ్రూపు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఒక ముఖ్య చొరవగా నిలుస్తుంది. ఇప్పటి వరకు, భారతదేశ వ్యాప్తంగా 95,000 మందికి పైగా బాలికలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఈ కార్యక్రమంలో ₹60 కోట్ల రూపాయలు వెచ్చించారు. బాలికల విద్యపై దృష్టి సారించడం ద్వారా, కేవలం వ్యక్తులను మాత్రమే కాకుండా మొత్తం సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించమే లక్ష్యంగా పనిచేస్తుంది, భావితరాలకు సామాజిక, ఆర్థిక పురోగతికి సాధనాలు ఉండేలా కృషి చేస్తుంది.

ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌తో పాటు, మలబార్ గ్రూప్ ‘హంగర్-ఫ్రీ వరల్డ్’ ప్రాజెక్ట్ దేశ వ్యాప్తంగా నిరుపేదలకు పౌష్టికాహారాన్ని అందిస్తుంది. స్వచ్ఛంద సేవకులతో కూడిన బలమైన నెట్‌వర్క్, స్థానిక ఎన్.జి.ఓల మద్దతుతో, ప్రపంచంలో ఆకలిని నిర్మూలించడానికి, అందరికీ ఆహార భద్రతను కల్పించడానికి మలబార్ గ్రూప్ కట్టుబడి ఉంది. ప్రస్తుతం, భారతదేశంలోని 16 రాష్ట్రాల్లోని 80 నగరాల్లో రోజుకు 50,000 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయబడుతున్నాయి. అంతే కాకుండా, జాంబియాలోని పాఠశాల విద్యార్థులకు ప్రతి రోజూ 10,000 ఆహార ప్యాకెట్లు అందించబడుతున్నాయి. భవిష్యతులో 200 కేంద్రాల నుండి, ప్రతి రోజూ 1,00,000 మందికి సేవలందించేలా ప్రాజెక్ట్‌ సైజ్ పెంచాలని మలబార్ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక సేవలో చురుగ్గా పనిచేస్తున్న ‘థనల్’ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ‘హంగర్ ఫ్రీ వరల్డ్’ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది.

‘గ్రాండ్‌మా హోమ్ ప్రాజెక్ట్‌’ను కూడా మలబార్ గ్రూప్ ప్రారంభించింది, ఈ గ్రూప్ నిరుపేద మహిళలకు పూర్తి సౌకర్యాలతో కూడిన వసతిని ఉచితంగా అందిస్తుంది, వారికి సంరక్షణను అందిస్తుంది. ప్రస్తుతం, ‘గ్రాండ్‌మా హోమ్స్’ బెంగళూరు, హైదరాబాద్‌లో నిర్వహించబడుతున్నాయి. కేరళలోని ప్రధాన నగరాలతో పాటు చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ముంబైకి విస్తరించాలని యోచిస్తోంది.
సమాజంలోని అట్టడుగు వర్గాలకు చేయూత ఇచ్చే లక్ష్యంతో మలబార్ గ్రూప్ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా వెనుకబడిన వర్గాలకు వైద్య సహాయం, గృహ నిర్మాణానికి మద్దతు ఇవ్వడం,
నిరుపేద మహిళల వివాహాలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఇప్పటి వరకు, మలబార్ గ్రూప్ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలలో ₹263 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టింది, ఇది స్థిరమైన అభివృద్ధికి గ్రూప్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

విద్య, ఆకలి లేని ప్రపంచం వంటి ప్రభావవంతమైన కార్యక్రమాలపై మలబార్ గ్రూప్ నిరంతరం దృష్టి సారిస్తుంది. అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించడం, సాధ్యమైనంత వరకు అన్ని విధాలుగా మద్దతు ఇచ్చినప్పుడే స్థిరమైన వృద్ధి సాధ్యమవుతుందని సంస్థ నమ్ముతుంది. మలబార్ గ్రూప్ వ్యాపార, సామాజిక బాధ్యతలు రెండింటినీ అంకితభావంతో విస్తరింపజేయడం కొనసాగిస్తుంది, భవిష్యత్తులో చేసే అన్ని ప్రయత్నాలకు ఇది కీలకం.

ఎడిటర్స్ నోట్ :
1999 సంవత్సరంలో మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ (MCT) స్థాపించబడింది, ఇది మలబార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నింటికీ CSR విభాగం. మలబార్ గ్రూప్ లాభాలలో 5% వరకు సామాజిక సేవ, దాతృత్వ కార్యక్రమాలకు కేటాయిస్తుంది. మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ కార్యకలాపాలు దేశ వ్యాప్తంగా ఉన్న మలబార్ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన మలబార్ గోల్డ్&డైమండ్స్ షోరూముల ద్వారా, స్థానిక కమ్యూనిటీలలో పని చేస్తున్న సంస్థల మద్దతుతో అమలు చేయబడుతున్నాయి.