HomeTelanganaUncategorized

మాయమైన మిల్లు సొత్తు……. దొంగలతో పాలకుల పొత్తు

మాయమైన మిల్లు సొత్తు……. దొంగలతో పాలకుల పొత్తు

మాయమైన మిల్లు సొత్తుదొంగలతో పాలకుల పొత్తు ? పరకాల ఓడిసిఎంఎస్ లో భారీ సామాగ్రిచోరీరూ 20 లక్షల విలువైన సొత్తు మాయం,బాధ్యులపై చర్యలు

తెలంగాణ గవర్నర్ కు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల నిరసన‌ – ఆగిన‌ బస్సులు
‘గ్రూప్స్’ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఆత్మ‌హత్య..అర్దరాత్రి హైదరాబాద్ లో విద్యార్థుల ఆందోళన‌
హైదరాబాద్ లో విద్యాసంస్థలకు ఈ రోజు సెలవు

మాయమైన మిల్లు సొత్తు
దొంగలతో పాలకుల పొత్తు ?

పరకాల ఓడిసిఎంఎస్ లో భారీ సామాగ్రిచోరీ
రూ 20 లక్షల విలువైన సొత్తు మాయం,
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం – డిసిఓ

పరకాల ఫిబ్రవరి 27 (నినాదం న్యూస్) :
పరకాల లోగల ఓడిసిఎంఎస్ మిల్లు భారీ చోరీకి గురైంది. సుమారు 50 ఏళ్ల చరిత్ర గలిగి ఉమ్మడి వరంగల్ జిల్లాకే తలమానికమైన ఈ మిల్లు దొంగతనంలో, సొంత సిబ్బంది సైతం భాగస్వాములేనని పెద్ద ఎత్తున ఆరోపణనలు వెల్లు వెత్తుతున్నాయి.

వివరాలిలా…….
పరకాల పట్టణ కేంద్రంలోగల ఓడిసిఎంఎస్ మిల్లులోని విలువైన కరెంటు మోటార్లు, ఇతర సామాగ్రి లూటీ అయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సుమారు రూ 20 లక్షలకు పైగా విలువ గల సామాగ్రి గుట్టు చప్పుడు కాకుండా దొంగిలించబడడం జరిగిందని, దీనికి ఓ డి సి ఎం ఎస్ అధికారుల అండదండలే కారణమని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. నిబంధనలతిక్రమించి కొందరు పదవులలో ఉండి గుట్టు చప్పుడు కాకుండా మిల్లు సొత్తును మింగేందుకే స్వాహా చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. గత 50 ఏళ్లుగా ఉన్న సదరు మిల్లు కొన్నేళ్ల క్రితం మూత పడింది. దీంతో అందులో ఉన్న కరెంటు మోటార్స్ ఇతర సామాగ్రి గుట్టు చప్పుడు కాకుండా ఓడిసిఎంఎస్ డైరెక్టర్, అధికారుల సహకారంతో కాజేసినట్లు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా అయితే బహిరంగ టెండరు పిలవాల్సి వస్తుందనే ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

చోరీ వాస్తవమే….
డిసిఓ సంజీవరెడ్డి

గటన పై జిల్లా డిసిఒ సంజీవరెడ్డి ని వివరణ కోరగా… ఓడిసిఎంఎస్ మిల్లు సామాగ్రి లూటీ జరిగిన విషయం వాస్తవమేనని, దీనిపై డీఎంవో కీరు నాయక్ ను విచారణ కు ఆదేశించామని తెలిపారు. కాగా విచారణ జరిపిన సదరు డిఎంఓ మిల్లులోని కరెంటు మోటార్లు, ఐరన్ చెక్కలు తదితర విలువైన సామాగ్రి మాయమైనట్లుగా తమకు ప్రాథమిక నివేదిక అందజేసినట్లు చెప్పారు. దీనికి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలుంటాయని, చట్టం ఎవరికీ చుట్టం కాదని ఎంతటి వారిననా ఉపేక్షించేది లేదని డిసిఓ తేల్చిచెప్పారు.