HomeTelanganaCrime

హైదరాబాద్ సిటీ కమిషనర్ సంచలన నిర్ణయం – పంజాగుట్ట పీఎస్ సిబ్బంది మొత్తం ఒకేసారి ట్రాన్స్ ఫర్

హైదరాబాద్ సిటీ కమిషనర్ సంచలన నిర్ణయం – పంజాగుట్ట పీఎస్ సిబ్బంది మొత్తం ఒకేసారి ట్రాన్స్ ఫర్

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చెందిన మొత్తం సిబ్బందిని ఒకే సారి ట్రాన్స్ ఫర్

ఎన్నికల్లో గెలుపోటములు సహజం.విర్రవీగిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు:మంత్రి పొన్నం ప్రభాకర్
పేదల కోసం గర్జించిన పాట వెళ్ళిపోతోంది… ప్రారంభమైన గద్దర్ అంతిమ యాత్ర
విద్యార్థులు యువతకు నైపుణ్యమైన శిక్షణ..సింగపూర్ సంస్థతో ప్రభుత్వ ఒప్పందం

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చెందిన మొత్తం సిబ్బందిని ఒకే సారి ట్రాన్స్ ఫర్ చేశారు. ఇన్ స్పెక్టర్ నుంచి హోంగార్డు వరకు మొత్తం 85 మంది సిబ్బందిని హైదరాబాద్ సీపీ బదిలీ చేశారు. వీరందరినీ సిటీ ఆర్మ్ డ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

భోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి వ్యవహారంతో పాటు పలు కీలక విషయాలు లీక్ కావడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లోని మాజీ ప్రభుత్వ అధికారులకు సమాచారం చేరవేసినట్లు ఆరోపణల నేపథ్యంలో సిబ్బంది అందరినీ బదిలీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు కొత్త సిబ్బందిని సీపీ కేటాయించారు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల నుంచి పంజాగుట్ట పీఎస్‌కు కొత్త సిబ్బందిని నియమించారు.ఒకే పోలీస్ స్టేషన్ నుంచి 85 మంది సిబ్బంది బదిలీ కావడం ఇదే తొలిసారి.