HomeTelanganaPolitics

ఏప్రెల్ లో లోక్ సభ ఎన్నికలు – ‍ స్పష్టం చేసిన కిషన్ రెడ్డి

ఏప్రెల్ లో లోక్ సభ ఎన్నికలు – ‍ స్పష్టం చేసిన కిషన్ రెడ్డి

లోక్ సభ ఎన్నికల కోసం దేశంలోని పార్టీలన్నీ సిద్దమైన వేళ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, కేంధ్ర‌ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశా

కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నాడు -బండి సంజయ్ సంచలన ఆరోపణ‌
ఆ ముఖ్యమంత్రి జైలు నుండే పరిపాలిస్తారట‌
తెలంగాణలో హిందుత్వ దూకుడు తగ్గించడం, అవసరమైతే పార్లమెంటులో BRS మద్దతు పొందడం…ఇవీ ఇప్పుడు బీజేపీ లక్ష్యాలు

లోక్ సభ ఎన్నికల కోసం దేశంలోని పార్టీలన్నీ సిద్దమైన వేళ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, కేంధ్ర‌ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.ఏప్రెల్ మొదటి వారంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు.

ఈ సారి మళ్ళీ బీజేపీ 350 లోక్ సభ సీట్లు గెలుచుకొని పూర్తి మెజార్టీతో అధిఅకారంలోకి వస్తుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో ఐదో ఆర్థికశక్తిగా ఎదిగిందని గుర్తుచేశారు. జాతీయ రహదారుల విస్తరణ జరిగిందని తెలిపారు. ఈ దేశ అభివృద్దికి బీజేపీ తప్ప మరో దారి లేదని ప్రజలు గ్రహించారని ఆయన అన్నారు.

తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని కిషన్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. గత బీఆరెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరైన మార్గంలో నడవడంలేదని చెప్పిన కిషన్ రెడ్డి అయినా కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి మరికొన్ని రోజులు సమయం ఇద్దామని కార్యకర్తలతో అన్నారు.