HomePoliticsAndhra Pradesh

ప్రత్యేక విమానంలో కడపకు బయల్దేరిన షర్మిల, కేవీపీ, రఘువీరారెడ్డి

ప్రత్యేక విమానంలో కడపకు బయల్దేరిన షర్మిల, కేవీపీ, రఘువీరారెడ్డి

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హైదరాబాద్ నుంచి కడపకు బయల్దేరారు. ఆమెతో పాటు సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరా రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావులు

దూకుడు పెంచిన వైఎస్ షర్మిల
ఈ నెల 21న ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న షర్మిల‌
ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాజీనామా

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హైదరాబాద్ నుంచి కడపకు బయల్దేరారు. ఆమెతో పాటు సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరా రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావులు కూడా పయనమయ్యారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వీరు ప్రత్యేక విమానంలో కడపకు వెళ్ళారు. కడప విమానాశ్రయం నుంచి వీరు రోడ్డు మార్గంలో ఈ సాయంత్రం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ కు చేరుకుంటారు. తన తండ్రి సమాధి వద్ద షర్మిల నివాళి అర్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆమె మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

ఈ రాత్రికి వీరు ఇడుపులపాయలోనే బస చేస్తారు. రేపు ఉదయం విజయవాడకు చేరుకుని, ఏపీసీసీ చీఫ్ గా షర్మిల‌ బాధ్యతలను స్వీకరిస్తారు. మరోవైపు షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు.