భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి అమెరికన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వైదొలిగారు. అయోవా రిపబ్లికన్ కాకస్‌లలో పేలవమైన ప్రదర్శన తర్వాత, ఆయ
భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి అమెరికన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వైదొలిగారు. అయోవా రిపబ్లికన్ కాకస్‌లలో పేలవమైన ప్రదర్శన తర్వాత, ఆయన 2024 US అధ్యక్ష రేసు నుండి తప్పుకున్నారు. డొనాల్డ్ ట్రంప్‌కు తన మద్దతును ప్రకటించారు.
రామస్వామి, ఫిబ్రవరి 2023లో అధ్యక్ష రేసులో ప్రవేశించినప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే ఇమ్మిగ్రేషన్‌పై తన బలమైన అభిప్రాయాలు , అమెరికా-మొదటి విధానం ద్వారా రిపబ్లికన్ ఓటర్లలో మద్దతును పొందగలిగారు. అతని ప్రచార వ్యూహం, అతని భావాలు, విధాన పరంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు దగ్గరగా ప్రతిబింబిస్తుంది. రామస్వామి గత ఎన్నికలలో ట్రంప్‌ను విజయపథంలో నడిపించిన సంప్రదాయవాదాన్ని వాడుకోవాలని ప్రయత్నించారు.
ఇక ట్రంప్ అయోవాలో విజయం సాధించారు, రిపబ్లికన్ నామినేషన్ కోసం తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు.
రామస్వామి, ఒహియో నివాసి. కేరళ నుండి వలస వచ్చిన తల్లిదండ్రులకు జన్మించాడు. ఇప్పటికీ ట్రంప్ ఆధిపత్యం చెలాయించే రిపబ్లికన్లలో ఆయనకు ఊహించని పోటీదారులలో ఒకరిగా మారడం ఆశ్చర్యమే.
ట్రంప్ తన ప్రచారంలో రామస్వామిపై నిప్పులు చెరిగారు. అతని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో రామస్వామిపై మోసగాడు అని ముద్ర వేశారు. అయోవాలో, రామస్వామి 7.7% ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు.