తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇంకా 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకవైపు అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా, పార్టీల అగ్రనేతలు గెలుపు ఓటముల లె
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇంకా 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకవైపు అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా, పార్టీల అగ్రనేతలు గెలుపు ఓటముల లెక్కలు వేసుకుంటున్నారు. మరో వైపు సర్వేలు కొంత మంది అభ్యర్థులకు చలిజ్వరం తెప్పిస్తున్నాయి.
ఇతరులు చేసిన సర్వేలే కాకుండా స్వంత సర్వేలు చేయించుకుంటున్న మూడు ప్రధాన పార్టీలైన బీఆరెస్, కాంగ్రెస, బీజేపీలు సర్వేల ఫలితాల ఆధారం గా తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దూసుకపోతున్నదని, తమకు ఓటమి తప్పేట్టు లేదని బీఆరెస్ సర్వేల్లో తేలినట్టు సమాచారం, ఇంటలీజన్స్ రిపోర్ట్ కూడా అదే విధంగా ఉండటంతో కేసీఆర్ రంగంలోకి దిగి ఒకప్పుడు ఒద్దనుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను మళ్ళీ తెరమీదికి తెచ్చినట్టు తెలుస్తోంది. ఉన్న పళంగా ప్రశాంత్ కిశోర్ ను హైదరాబాద్ కు రప్పించిన కేసీఆర్ ఆయనతో ప్రగతి భవన్ లో మూడు గంటలపాటు సమావేశమైనట్టు, అనంతరం కేటీఆర్ కూడా ప్రశాంత్ కిశోర్ తో మాట్లాడినట్టు గురురాజ్ అంజన్ అనే రాజకీయ పరిశీలకుడు ఓ ట్వీట్ చేశారు.
గతంలో ప్రశాంత్ కిశోర్ సేవలను కేసీఆర్ వద్దనుకున్నారు. అయితే మారిన రాజకియ పరిస్థితుల్లో మళ్ళీ ఆయనను రంగంలోకి దింపక తప్పలేదని చెప్తున్నారు. ఈ 8 రోజులకు గాను ప్రశాంత్ కు ఊహించని ఆఫర్ ఇవ్వడంతో ఆయన కూడా ఒప్పుకొని వెంటనే పని మొదలు పెట్టారని సమాచారం.
ప్రశాంత్ కిశోర్ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి సేవలు అందించనున్న పీకే ఇప్పుడు బీఆరెస్ తరపున రంగంలోకి దిగడం, మరో వైపు ఆయన శిష్యుడు సునీల్ కొనగోలు కాంగ్రెస్ తరపున వ్యూహకర్తగా పని చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో గతంలో పలు ఎన్నికలను చూశాం. ఆయన ఎవరి వైపు వ్యూహకర్తగా పని చేసినా వారి విజయం పక్కా అనే ప్రచారం ఉంది. ఇప్పటి వరకు ఆయనకు 80 శాతం విజయాలే ఉన్నాయి. పైగా ఆయన అడుగుపెట్టిన చోట అబద్దాలు, అర్ద సత్యాలు, విద్వేశాలు, గొడవలు రాజయమేలుతాయనే వాదన కూడా ఉంది. తిమ్మిని బమ్మి చేయడంలో దిట్ట అనే పేరు ప్రశాంత్ కిశోర్ కు ఉంది.
మరి ఈ 8 రోజుల్లో ప్రశాంత్ కిశోర్ ఏమి చేయగలడు, ప్రస్తుతమన్న రాజకీయ పరిస్థితిని పూర్తిగా మార్చగలడా ? కాంగ్రెస్ వైపు మళ్ళిన ఓటర్లను బీఆరెస్ వైపు తీసుకరాగలడా కేసీఆర్ కు హాట్రిక్ విజయాన్ని సాధించిపెట్టగలడా అనేది డిశంబర్ 3వ తేదీన తేలుతుంది.
TELANGANA BIGGEST SENSATIONAL BREAKING:#TelanganaAssemblyElections2023#PKMeetsKCR: INTELLIGENCE PREDICTS DOWNFALL OF BRS; KCR DIALS PK.!
— Gururaj Anjan (@Anjan94150697) November 21, 2023
📌Modi fan boy Prashant Kishor met father-son duo of BRS at their residence; KCR-KTR had a three-hour talk between 6 to 9 pm yesterday.… pic.twitter.com/kOpubOTOms