HomeTelanganaPolitics

తెలంగాణ లో హంగ్ వస్తే ఏం జరుగుతుంది ? ఎవరు అధికారంలోకి వస్తారు ?

తెలంగాణ లో హంగ్ వస్తే ఏం జరుగుతుంది ? ఎవరు అధికారంలోకి వస్తారు ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 24 రోజులే మిగిలున్నాయి. ప్రధాన ప్రత్యర్థులైన అధికార BRS, కాంగ్రెస్, BJP లు తమ ప్రచార జోరును పెంచాయి. ప్రస్తుత పరిస్థి

మూడవ జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, రెండు చోట్ల నుంచి రేవంత్ పోటీ
బీజేపీకి బిగ్ షాక్ – రాజగోపాల్ రెడ్డి, వివేక్ లు కాంగ్రెస్ లోకి?
మోడీతో ప్రైవేటు మీటింగ్ లో మాట్లాడిన సంచలన విషయాలు బైటపెట్టిన కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 24 రోజులే మిగిలున్నాయి. ప్రధాన ప్రత్యర్థులైన అధికార BRS, కాంగ్రెస్, BJP లు తమ ప్రచార జోరును పెంచాయి. ప్రస్తుత పరిస్థితిని చూస్తూ ఉంటే బీఆరెస్ కాంగ్రెస్ ల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ జరిగేట్టుగా ఉంది. బీజేపీ మూడవ స్థానానికే పరిమితమవుతుందనే రిపోర్టులు వస్తున్నాయి. అయితే ఆ పార్టీ పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమికి బీఆరెస్ గెలుపుకు కారణమయ్యే అవకాశం కనపడుతోంది.

ఇప్పటి వరకు వచ్చిన సర్వేల్లో ఎక్కువ శాతం బీఆరెస్ గెలుపునే సూచిస్తుండగా, పలు సర్వేలు మాత్రం కాంగ్రెస్ గెలుస్తుందని తేల్చాయి. కాగా తాజాగా వచ్చిన C-Voter – ABP ఒపీనియన్ పోల్స్ మాత్రం హంగ్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఆ ఒపీనియన్ పోల్స్ ప్రకారం అధికార బీఆర్ఎస్ పార్టీకి 49 నుంచి 61 స్థానాలు , కాంగ్రెస్ పార్టీకి 43 నుంచి 55 స్థానాలు, బీజేపీకి 5 నుంచి 11 స్థానాలు, ఇతరులకు 4 నుంచి 10 స్థానాలు వస్తాయి.

ఈ ఒపీనియన్ పోల్ నిజమైతే తెలంగాణలో హంగ్ తప్పకపోవచ్చు. ఇప్పటి వరకు గత హైదరాబాద్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ఎప్పుడు ఇక్కడ హంగ్ రాలేదు. అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనా పూర్తి మెజార్టీతోనే గద్దెనెక్కింది. ఒకవేళ ఒపీనియన్ పోల్ అంచనా నిజమైతే చరిత్రలో తొలి సారి హంగ్ ఏర్పడే అవకాశం ఉంది.

ఒక వేళ హంగ్ ఏర్పడితే ఏ జరగుతుందనే చర్చ కూడా తెలంగాణలో అప్పుడే మొదలయ్యింది. దేశవ్యాప్తంగా బెట్టింగ్ రాయుళ్ళు కూడా హంగ్ అసెంబ్లీ పై బెట్టి‍ంగులుకాస్తున్నారు.
ఒక వేళ కాంగ్రెస్ కు 60 సీట్ల కన్నా ఒక్క సీటు తక్కువైనా, బీఆరెస్ కు 60 సీట్లు రాకపోయినా బీఆరెస్సే అధికారంలోకి రావడం ఖాయమనే విశ్లేషణలు వినవస్తున్నాయి. కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా చేయడం కోసం బీజేపీ బీఆరెస్ కు బైటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని, బీజేపీ మద్దతుతో ఎమ్ ఐ ఎమ్ తో కలిసి బీఆరెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాజకీయ్ పండితుల భావన.

ఒకవేళ కాంగ్రెస్ కు 60-65 ‍మధ్య సీట్లు వచ్చినప్పటికీ ఆ పార్టీని చీల్చడం పెద్ద కష్టం కాదనుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి రేసులో 5 గురు ఉండగా రేపు గెలిస్తే మంత్రి పదవుల కోసం పోటీ మామాలుగా ఉండదు. అలాంటి పరిస్థుతుల్లో కొందరికి పదవుల ఆశ చూపి వారి మధ్య చీలిక తేవడం చాలా సులభమని ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతల చరిత్ర చూసిన రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

మరో వైపు బీజేపీ 25 లేదా ఆ పైన సీట్లు కనక సంపాదించగలిగితే తామే అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నాయకులు కొందరు ధీమాగా చెప్తున్నారు. ఎలాగూ బీజేపీ దగ్గర డబ్బుకు కొదవ లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కూడా పదవుల పంపకం చేయగలదు. అందువల్ల గతంలో కర్నాటక, మహా రాష్ట్ర, మధ్యప్రదేశ్ లో మాదిరిగా ఇతర పార్టీల‌ నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి పెద్ద భాగాన్ని చీల్చి, బీఆరెస్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని అంచనా వేస్తున్నారు.

మొత్తానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు హంగ్ కు దారి తీస్తే కాంగ్రెస్ అధికార ఆశ తీరకపోవచ్చు. బీఆరెస్, బీజేపీలు అధికారంలోకి రావడం పక్కా. అటు బీజేపీ మద్దతుతో బీఆరెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా, స్వయంగా బీపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా తెలంగాణను బీజేపీ పెద్దలే పాలిస్తారన్నది వాస్తవం