వన్డే వరల్డ్ కప్ లో ఇండియా ఈ రోజు పాకిస్తాన్ పై ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను, రెండో మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్‌ను
వన్డే వరల్డ్ కప్ లో ఇండియా ఈ రోజు పాకిస్తాన్ పై ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను, రెండో మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్‌ను ఓడించిన భారత్ మూడో మ్యాచ్ లో ఈ రోజు పాకిస్తాన్ ను ఓడించింది.
పాకిస్తాన్, ఇండియా టీం ముందు ఉంచిన 192 పరుగుల టార్గెట్ ను 7 వికెట్ల తేడాతో 30.3 ఓవర్లలో ఛేదించారు. ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 6 సిక్స్ లు, 6 ఫోర్లతో 86 పరుగులు చేసి ఇండియా గెలుపును నిర్దేషించాడు. శ్రేయస్ అయ్యర్ 53 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 16 పరుగులు, గిల్ 16 పరుగులు చేసి ఔటయ్యారు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 42.5 ఓవర్లకు 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు, హార్దిక్ 2, సిరాజ్ 2, కుల్‌దీప్ యాదవ్ 2, జడేజా 2 వికెట్లు తీశారు.