HomeInternational

ఇజ్రాయిల్ పై 5వేల రాకెట్లతో దాడి చేసిన హమస్

ఇజ్రాయిల్ పై 5వేల రాకెట్లతో దాడి చేసిన హమస్

పాలస్తీనాకు, ఆ దేశాన్ని ఆక్రమించిన ఇజ్రాయిల్ కు మధ్య మళ్ళీ యుద్దం మొదలయ్యింది. అమెరికా, యూరప్ మద్దతుతో పాలస్తీనాను ఆక్రమించి ఇజ్రాయిల్ అనే దేశాన్ని ఏ

ఇకపై ప్రతి భక్తుడికి ఒక కర్ర ఇవ్వనున్న టీటీడీ … తిరుమలలో పులుల నుండి భక్తుల రక్షణకు చర్యలు
ఈక్వెడార్‌లో టీవీ న్యూస్‌ ఛానల్‌పై దుండగుల దాడి – లైవ్ లో ప్రసారం
మేక దొంగతనం నెపంతో దళిత యువకుడిని చిత్రహింసలకు గురిచేసిన నిందితుల అరెస్ట్

పాలస్తీనాకు, ఆ దేశాన్ని ఆక్రమించిన ఇజ్రాయిల్ కు మధ్య మళ్ళీ యుద్దం మొదలయ్యింది. అమెరికా, యూరప్ మద్దతుతో పాలస్తీనాను ఆక్రమించి ఇజ్రాయిల్ అనే దేశాన్ని ఏర్పాటు చేసి పాలస్తీనీయులపై హింసకు పాల్పడుతున్న ఇజ్రాయిల్ పాలకులపై పాలస్తీనీయుల పోరాటం ఈనాటిది కాదు. ఇజ్రాయిల్ దైష్టికాలకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలే ఆయుధాలు చేపట్టి హమస్ అనే మిలిటెంట్ సంస్థ ఆద్వర్యంలో పోరాడుతున్నారు. అయితే అత్యంత శక్తివంతమైన ఇజ్రాయిల్ ను ఎదుర్కోలేక పాలస్తీనా ఎప్పటికప్పుడు నష్టపోతూనే ఉంది. అయినప్పటికీ పాలస్తీనా ప్రజలు తమ పోరాటం మాత్రం ఆపడం లేదు. అమెరికా, యూరప్ దేశాలు ఇజ్రాయిల్ కు మ్ద్దతుగా ఉన్నప్పటికీ ప్రజలు ఏ మాత్రం భయపడకుండా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు.

గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనా మిలిటెంట్లు శనివారం ఇజ్రాయిల్ పైకి 20 నిమిషాల సమయంలో 5 వేల రాకెట్లతో దాడి చేశారు. ఒకవైపు రాకెట్ల దాడి జరుగుతుండగానే మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్‌లోకి కాల్పులు జరుపుతూ వాహనాల్లో దూసుక పోయారు. ఒక పోలీసు స్టేషన్ ను మిలిటెంట్లు ఆక్రమించినట్టు సమాచారం.ఈ దాడిలో ఇప్పటివరకు కనీసం ఒకరు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు.

ఈ దాడికి ప్రతిస్పందనగా, ఇజ్రాయెల్ యుద్ధానికి తాము సిద్దం అని ప్రకటించింది. ప్రకటించింది.

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో నెలల తరబడి పెరుగుతున్న హింసాకాండతో ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో మరణాలు సంవత్సరాల్లో ఎన్నడూ చూడని స్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్ దక్షిణ , మధ్య ప్రాంతాలలో వైమానిక దాడి సైరన్‌లు విలపించాయి.ఇజ్రాయెల్ సైన్యం బాంబు షెల్టర్‌ల దగ్గర ఉండమని ప్రజలను కోరింది. ఇజ్రాయిల్ కూడా యుద్దం ప్రకటించింది.

“ఆపరేషన్ అల్-అక్సా స్టార్మ్” ప్రారంభించామని హమాస్ సైనిక విభాగం నాయకుడు మహ్మద్ దీఫ్ ప్రకటించారు. ఈ పోరాటంలో చేరాలని పాలస్తీనియన్లకు ఆయన‌ పిలుపునిచ్చారు.

కొద్ది రోజుల క్రితం అల్ అక్సా మాస్క్ ను అపవిత్రం చేసిన ఇఉజ్రాయిల్ పాలస్తీనీయులపై దాడులకు దిగడానికి వ్యతిరేకంగా “ఆపరేషన్ అల్-అక్సా స్టార్మ్” ను ప్రారంభించినట్టు హమస్ చెబుతోంది.

మరో వైపు ఇజ్రాయిల్ సైన్యం ప్రతి దాడులు చేస్తోంది. గాజా స్ట్రిప్ లోని హమాస్ స్థావరాలపై దాడులు జరిపింది. ప్రత్యర్థుల రాకెట్లు కూల్చేసేందుకు యాంటీ రాకెట్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసింది. మిలిటెంట్లు 35 మంది ఇజ్రాయిల్; సైనికులను కిడ్నాప్ చేసినట్టు ఇజ్రాయిల్ ఆరోపించింది. ఇరు దేశాల మధ్య దాడుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.