HomeInternational

కెనడా ఆర్మీ వెబ్ సైట్ పై ఇండియా హ్యాకర్ల దాడి

కెనడా ఆర్మీ వెబ్ సైట్ పై ఇండియా హ్యాకర్ల దాడి

కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో కెనడియన్ పౌరుడైన సిక్కు నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హత్య చేయడంలో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాన మ

ఎన్డీయే Vs ఇండియా.. బీజేపీకి దేశభక్తితోనే చెక్ పెట్టబోతున్న కాంగ్రెస్!
Cricket: హ్యాట్రిక్ కొట్టిన‌ ఇండియా… పాక్ పై ఘన విజయం
పాస్‌పోర్ట్ ర్యాంకుల్లో ఇండియా స్థానం ఎంతో తెలుసా ?

కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో కెనడియన్ పౌరుడైన సిక్కు నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హత్య చేయడంలో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో బహిరంగంగా ఆరోపించిన తర్వాత కెనడా, ఇండియాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాక ఒకరి అంబాసిడర్ లను మరోకరు బహిష్కరించారు కూడా. ఈ నేపథ్యంలో కెనడా ఆర్మీ వెబ్ సైట్ పై ఇండియాకు చెందిన హ్యాక‌ర్లు దాడి చేశారు.

కెనడియన్ సాయుధ దళాల వెబ్‌సైట్ పై సైబర్ అటాక్ జరగడంతో బుధవారం వెబ్ సైట్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ అటాక్ తామే చేశామని భారత్ అనుకూల హ్యాకర్లు ప్రకటించారు.

‘ఇండియన్ సైబర్ ఫోర్స్ హ్యాకింగ్ గ్రూప్’ కెనడియన్ మిలిటరీ వెబ్‌సైట్‌ని టెలిగ్రామ్‌లో తీసివేసినట్లు స్క్రీన్‌షాట్‌లను ట్విట్టర్ లో . కెనడియన్ వార్తాపత్రిక గ్లోబ్ అండ్ మెయిల్ ప్రకారం, ఈ అటాక్ రెండు గంటలపాటు కొనసాగుతుందని ఆ గ్రూపు తెలిపింది.

ఒక ప్రకటనలో, కెనడా నేషనల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్‌లో మీడియా సంబంధాల అధిపతి డేనియల్ లే బౌథిల్లియర్ మాట్లాడుతూ, వెబ్ సైట్ అంతరాయం బుధవారం ఆ మధ్యాహ్నం తర్వాత సరిదిద్దబడింది” అని అన్నారు.

కెనడా ప్రభుత్వం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ పబ్లిక్ వెబ్‌సైట్లు, అంతర్గత నెట్‌వర్క్‌ల నుండి వేరుగా ఉన్నవెబ్ సైట్ పై సైబర్ అటాక్ జరిగిందని నివేదిక పేర్కొంది.

గ్లోబ్ అండ్ మెయిల్ ప్రకారం, కమ్యూనికేషన్స్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్‌మెంట్ – కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ – సైబర్ అటాక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సమాచార , సాంకేతిక నిర్వాహకులను గత వారం హెచ్చరించింది.

“తమ శక్తి ఏంటో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి” అని సెప్టెంబరు 20న కెనడాకు ఇండియన్ సైబర్ ఫోర్స్ బెదిరించింది. రెండు రోజుల తర్వాత, ”కెనడియన్ ప్రభుత్వంచేస్తున్న‌ ఆరోపణలు , భారత వ్యతిరేక రాజకీయాలు హద్దులు దాటిపోయాయి.” అని ఆ హ్యాకర్ గ్రూపు మరో ప్రకటన విడుదల చేసింది.