HomePoliticsNational

ఎన్నికలకు ముందు పెరిగిన బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలు: అమెరికా సంస్థ రిపోర్ట్

ఎన్నికలకు ముందు పెరిగిన బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలు: అమెరికా సంస్థ రిపోర్ట్

2023 ప్రథమార్థంలో భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగాల ఉదంతాలపై చాలా ఆందోళన కలిగించే ఓ నివేదిక కొన్ని దిగ్భ్రాంతికరమైన పోకడలను వెల్లడించింది. వీటిలో 80 శాత

కేటీఆర్ కు తప్పిన ప్రమాదం
కాంగ్రెస్ అభ్యర్థుల మీదనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ?
తెలంగాణలో కాంగ్రెస్ దే గెలుపు – ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి

2023 ప్రథమార్థంలో భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగాల ఉదంతాలపై చాలా ఆందోళన కలిగించే ఓ నివేదిక కొన్ని దిగ్భ్రాంతికరమైన పోకడలను వెల్లడించింది. వీటిలో 80 శాతం ద్వేషపూరిత ప్రసంగాలు BJP, RSS లేదా వారి అనుబంధ సంస్థలనేతలు చేసినవి. వీటిలో 70 శాతం సంఘటనలు 2023 లేదా 2024లో శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నివేదించబడ్డాయి.

గ్లోబల్ పబ్లికేషన్స్, వార్తా ఏజెన్సీలు ప్రచురించిన ఈ నివేదిక వైరల్ అవుతున్న ఈ నివేదిక వాషింగ్టన్ ఆధారిత హిందూత్వ వాచ్ ఆధారాలతో సహా రూపొందించింది. ఇది దేశానికి పెద్ద అవమానం అని ప్రజాస్వామికవాదులు ఆందోళన చెందుతున్నారు.

2023 ప్రథమార్ధంలో భారతదేశంలోని ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా హిందూ తీవ్రవాద-రైట్ గ్రూపులు నిర్వహించిన అన్ని ద్వేషపూరిత ప్రసంగాలను డాక్యుమెంట్ చేసినట్లు ‘హిందూత్వ వాచ్’ నివేదిక పేర్కొంది. ఈ సంస్థ‌ ద్వేషపూరిత ప్రసంగాన్ని నిర్వచించడానికి ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్‌ను స్వీకరించింది.

ఇది ద్వేషపూరిత ప్రసంగాన్ని “ఏదైనా మతం, జాతి, జాతీయత, రంగు, సంతతి, లింగం లేదా ఇతర లక్షణాల ఆధారంగా వ్యక్తి లేదా సమూహం పట్ల పక్షపాతం లేదా వివక్షతతో కూడిన భాషను ఉపయోగించే మౌఖిక, రాతపూర్వక లేదా ప్రవర్తనాపరమైన కమ్యూనికేషన్ రూపం. అని పేర్కొంది.

బిజెపి అధికారం చేపట్టిన 2014 నుండి భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగాల ధోరణి పెరుగుతోందని ఎత్తి చూపుతూ, ప్రభుత్వ అధికారులు కూడా తరచుగా ఈ పని చేస్తున్నారని నివేదిక పేర్కొంది. ద్వేషపూరిత ప్రసంగాలను ప్రోత్సహించేవారిలో ముఖ్యమంత్రులు, శాసనసభ్యులు , బిజెపికి చెందిన సీనియర్ నాయకులు ఉన్నారు.

లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, హలాల్ జిహాద్, బిజినెస్ జిహాద్ వంటి కుట్ర సిద్ధాంతాల ప్రచారం, ఎన్నికల ప్రయోజనం కోసం హిందూ జాతీయవాదాన్ని సమీకరించడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలతో ముడిపడి ఉందని, ఈ సంఘటనలపై భారతదేశంలోని సెక్షన్ 153A కింద కేసులు నమోదు చేసినట్లు అధికారిక డేటాను ఉటంకిస్తూ పేర్కొంది. 2014 , 2020 మధ్య శిఈ ద్వేషపూరిత ప్రసంగాల కేసులు 500 శాతానికి పైగా పెరిగాయి.

2023 మొదటి ఆరు నెలల్లో (181 రోజులు), 17 రాష్ట్రాల్లో 255 ద్వేషపూరిత ప్రసంగాల సమావేశాలు లేదా ర్యాలీలు నమోదయ్యాయని నివేదిక వెల్లడించింది. ఇలాంటి ఘటనలు ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరిగాయి.

అత్యంత ఆసక్తికరంగా, ఈ సంఘటనలలో గణనీయమైన భాగం 2023, 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న‌ రాష్ట్రాలలో జరిగాయి. ఇది ఓటర్లను సమీకరించడం కోసం చేస్తున్న పనిగా నిరూపితమవుతున్నది.

నివేదిక చెప్పిన వివరాలు:

2023 ప్రథమార్థంలో 255 ద్వేషపూరిత ప్రసంగాల సంఘటనలు నమోదు చేయబడ్డాయి
వీటిలో 205 (80%) బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగాయి.
మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలో అత్యధిక సంఖ్యలో విద్వేషపూరిత ప్రసంగాలు జరిగాయి
ఇలాంటి ఘటనల్లో 29% ఒక్క మహారాష్ట్రలోనే జరిగాయి.
బిజెపి పాలిత రాష్ట్రాలు/యుటిలలో 52% ద్వేషపూరిత ప్రసంగ సమావేశాలు RSS , BJPకి అనుబంధంగా ఉన్న సంస్థలు నిర్వహించాయి.
వీటిలో VHP, బజరంగ్ దళ్, సకల్ హిందూ సమాజ్ తదితర సంస్థలున్నాయి.
17 రాష్ట్రాల్లో 42% ద్వేషపూరిత ప్రసంగ సమావేశాలు RSS-అనుబంధ సమూహాలు నిర్వహించాయి.
33% సమావేశాలు ముస్లింలపై హింసకు బహిరంగంగా పిలుపునిచ్చాయి
దాదాపు 12% సమావేశాల్లో ఆయుధాలు పట్టుకొని దాడులు చేయాలని పిలుపునిచ్చాయి.
2023 లేదా 2024లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో 70% సంఘటనలు జరిగాయి.