ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ED మరో సారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారంనాడు ఢిల్లీలోని ఈడీ కార్య
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ED మరో సారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారంనాడు ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కవిత విచారణకు హాజరుకావాలని ఈడీ ఈ నోటీసుల్లో పేర్కొంది.
ఈ కేసులో గతంలో కూడా ఈడీ కవితను ఒక సారి విచారించిన ఈడీ మళ్ళీ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడం బీఆరెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది.
ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారాడు. ఆయన ప్రత్యేక జడ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఈ మేరకు ఈడీ అధికారులు రికార్డ్ చేశారని తెలుస్తోంది. ఈ కేసులో రామచంద్ర పిళ్లై కంటే ముందు శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ, దినేష్ అరోరాలు అప్రూవర్‌గా మారారు. ఈ క్రమంలో కవిత విచారణ కీలకంగా మారింది.
నోటీసులు వచ్చిన నేపథ్యంలో కవిత లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్టు సమాచారం. రేపటి విచారణకు హాజరు అవుతారా లేదా అనే విషయం పై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ కేసులో చాలా కాలం కామ్ గా ఉన్న ఈడీ సడెన్ గా మళ్ళీ కవితను మళ్ళీ విచారణ చేయడానికి సిద్దమవడం బీఆరెస్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.