తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలను వక్రీకరించిన బీజేపీ నాయకులు ఇప్పుడు ద
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలను వక్రీకరించిన బీజేపీ నాయకులు ఇప్పుడు దానిని ప్రచారాస్త్రంగా ఎక్కుబెట్టారు.
తమిళనాడులోని ఓ రచయితల సభలో ఉదయనిధి మాట్లాడుతూ, సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగ్యూ, కరోనా లాంటిది. దానిని వ్యతిరేకించడంతో సరిపెట్టుకోవద్దు దాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానిం చారు. సనాతన ధర్మం వల్ల సమానత్వానికి భంగం వాటిల్లుతుందని ఆయన అన్నారు.సమాజాన్ని కులం, స్రీ-పురుష బేధాలతో విభజిస్తుందని, సమానత్వం, సామాజిక న్యాయం వంటి వాటికి సనాతన ధర్మం ప్రాథమికంగా వ్యతిరేకమని ఆయన అన్నారు.
ఉదయనిధి అన్న ఈ మాటలను వక్రీకరించిన బీజేపీ నేతలు దేశంలో హిందువుల జెనొసైడ్ కు ఉదయనిధి పిలుపునిచ్చాడని అబద్దాల ఆరోపణలు మొదలు పెట్టారు.
”భారత్‌లో 80 శాతం జనాభా నరమేధానికి ఉదయనిధి పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ తరచూ ‘ప్రేమ దుకాణం’ గురించి మాట్లాడతారు కానీ కాంగ్రెస్‌కు మిత్ర పార్టీ అయిన డీఎంకే వారసుడు మాత్రం నరమేధానికి పిలుపునిచ్చాడు. ఇండియా కూటమి తన పేరుకు తగట్టు అవకాశం వస్తే అనేక యుగాల నాటి ‘భారత్’ అనే సంస్కృతిని సర్వనాశనం చేస్తుంది’’ అంటూ బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వీయ ట్వీట్ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఆరెస్సెస్, బీజేపీ ఫ్యాన్స్ ఉదయనిధిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయనను అరెస్టు చేసి కేసు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఉదయనిధి స్టాలిన్ మాత్రం వెనక్కు తగ్గలేదు. తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నానని, అవసరమైతే చర్చకు తాను సిద్దమని సవాల్ విసిరాడు. తానెక్కడా నరమేధం గురించి మాట్లాడలేదన్న ఆయన, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ‘‘సనాతన ధర్మం కారణంగా ఇబ్బందులు పాలైన బడుగు, అణగారిన వర్గాల తరుపున నేను మాట్లాడాను. పేరియార్, అంబేద్కర్ వంటి వారు ఈ అంశంపై లోతైన పరిశోధనలు చేసి పలు రచనలు చేశారు. సమాజంపై సనాతన ధర్మం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించిందో చెప్పారు. అవన్నీ ఊటంకించేందుకు నేను సిద్ధంగా ఉన్నా’’ అని స్పష్టం చేశారు.
‘‘నా ప్రసంగంలోకి కీలక భాగాన్ని ఇక్కడ మరోసారి ప్రస్తావిస్తున్నా. దోమల కారణంగా కొవిడ్, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ఎలా వ్యాపిస్తాయో అదే విధంగా సనాతన ధర్మం సామాజిక రుగ్మతలకు దారి తీసింది. న్యాయస్థానంలోనైనా.. ప్రజాకోర్టులో అయినా సరే.. ఎటువంటి సవాలుకైనా సరే సిద్ధంగా ఉన్నా. తప్పుడు వార్తల వ్యాప్తిని మానుకోండి’’ అంటూ ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
చెన్నైలో ఇటీవల జరిగిన ఓ రచయితల సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కేవలం ప్రతిఘటిస్తే సరిపోదని పూర్తిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మమనే భావనే తిరోగమన పూర్వకమని అభిప్రాయపడ్డారు. సమాజాన్ని కులం, స్రీ-పురుష బేధాలతో విభజిస్తుందని, సమానత్వం, సామాజిక న్యాయం వంటి వాటికి ప్రాథమికంగా వ్యతిరేకమని అన్నారు.
కాగా, సోషల్ మీడియాలో తమిళనాడు నుండి ఉదయనిధికి మద్దతు పెరుగుతోంది. నిజాన్ని ఒప్పుకోవడానికి బిజేపీ ఎప్పుడూ భయపడుతుందని, అబద్దాల ప్రచారంతో దాడులు చేస్తుందని నెటిజనులు మండిపడుతున్నారు. సనాతన ధర్మం లేకపోతే మనదేశ౦లో కులమనే మహమ్మారి ఉండకపోయేదని, కుల వివక్ష, దౌర్జన్యాలు లేని సమాజం ఉండేదని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. స్త్రీలను రెండవ తరగతి పౌరులుగా చూసే దౌర్భాగ్యం సనాతన ధర్మం వల్లనే వచ్చిందని కామెంట్ చేస్తున్నారు.
I never called for the genocide of people who are following Sanatan Dharma. Sanatan Dharma is a principle that divides people in the name of caste and religion. Uprooting Sanatan Dharma is upholding humanity and human equality.
— Udhay (@Udhaystalin) September 2, 2023
I stand firmly by every word I have spoken. I spoke… https://t.co/Q31uVNdZVb