HomePoliticsNational

బీజేపీ నన్ను మణిపూర్ సమస్య‌పై పార్లమెంటులో మాట్లాడనివ్వలేదు…. బీజేపీ మిత్ర పక్ష ఎంపీ ఆరోపణ‌

బీజేపీ నన్ను మణిపూర్ సమస్య‌పై పార్లమెంటులో మాట్లాడనివ్వలేదు…. బీజేపీ మిత్ర పక్ష ఎంపీ ఆరోపణ‌

ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా పార్లమెంట్ లో మణిపూర్‌పై మాట్లాడాలని కోరుకున్నానని, అయితే ఈ విషయంపై మాట్లాడవద్దని కూటమి

బీజేపీకి బిగ్ షాక్ – రాజగోపాల్ రెడ్డి, వివేక్ లు కాంగ్రెస్ లోకి?
బీజేపీకి ఈటల రాజేందర్ గుడ్ బై చెప్పనున్నారా ?
కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం: కలకలం రేపుతున్న BJP నేతల వివాదాస్పద‌ వ్యాఖ్యలు

ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా పార్లమెంట్ లో మణిపూర్‌పై మాట్లాడాలని కోరుకున్నానని, అయితే ఈ విషయంపై మాట్లాడవద్దని కూటమిలోని బిజెపి నేతలు ఒత్తిడి తెచ్చారని ఔటర్ మణిపూర్ నియోజకవర్గం నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్) ఎంపి లోర్హో ఎస్. ఫోజ్ అన్నారు.
శనివారం ది హిందూతో ఆయన మాట్లాడుతూ తన నియోజకవర్గంలో కొనసాగుతున్న జాతి వివాదం వల్ల మా ప్రాంతమంతా హింసాత్మకంగా మారిపోయింది. ఈ హింసను అరికట్టాల్సిన అవసరం ఉందని,సాధారణ పరిస్థితులు తిరిగి తీసుకురావడం కోసం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని తన నియోజకవర్గాల ప్రజలకు, భారతదేశ ప్రజలకు చెప్పాలనుకున్నానని ఎంపీ అన్నారు.

మణిపూర్‌లో ముఖ్యంగా కుకి-జో కమ్యూనిటీ నుండి బాధితులైన‌ వారిలో ఎక్కువ మంది తన నియోజకవర్గానికి చెందిన వారేనని, అలాగే మరో మూడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో నివసిస్తున్న మీటీలు కూడా తన నియోజకవర్గంవారే అని ఆయన అన్నారు.

”ప్రధానంగా మణిపూర్ అంశంపై అవిశ్వాస తీర్మానం రాబోతోందని, దానిపై సభలో మాట్లాడాలని తనకు తెలుసునని ఫోజ్ తెలిపారు. “నేను కూటమికి చెందిన నా స్నేహితులు, ముఖ్యంగా బీజేపీకి చెందినవారితో మాట్లాడాను. గౌరవనీయులైన గృహ్ మంత్రి-జీ (హోం మంత్రి అమిత్ షా) మణిపూర్‌పై చాలా విషయాలుమాట్లాడతారని, కాబట్టి మీరు మాట్లాడవద్దని వారు చెప్పారు. ” అని లోర్హో ఎస్. ఫోజ్ అన్నారు.

బీజేపీ వారి వత్తిడి తర్వాత పార్లమెంటులో మాట్లాడేందుకు స్పీకర్‌ను అవకాశం కూడా అడగలేదని, ఎందుకంటే, “నేను అడిగినా, నాకు ఇవ్వరని నాకు తెలుసు” అని ఫోజ్ చెప్పారు.

”తనను మాట్లాడవద్దని మణిపూర్‌లోని బిజెపి ఎంపీ ఆర్.కె. రంజన్ సింగ్ నాకు చెప్పారు.” అని ఫోజ్ స్పష్టం చేశారు.

“వాస్తవానికి, మణిపూర్‌లో మా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది మేము కాబట్టి, మమ్మల్ని మాట్లాడమని అడగాలి. ఎన్నికలు రానున్నందున అది నా ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మణిపూర్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తీవ్రంగా వ్యవహరిస్తుందని మా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ”అని ఫోజ్ అన్నారు.

అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ X (గతంలో ట్విటర్‌గా పిలిచేవారు)లో ఒక పోస్ట్‌లో శనివారం ఇలా అన్నారు: “భారత పార్లమెంట్‌లో నాతో సహా మణిపూర్‌పై అందరూ మాట్లాడారు, కానీ మణిపూర్ కు చెందిన‌ ఎంపీలను అనుమతించలేదు. నేను స్పీకర్‌ను వేడుకున్నాను కానీ మణిపూర్ ఎంపీల మాటలు వినేంత సున్నితత్వం, ఓపిక ప్రధాని మోడీకి, హోం అమిత్ షాకు 2 నిమిషాలు కూడా లేదు.” అని కామెంట్ చేశారు.

MP మరియు కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్సోషల్ మీడియాలో , “మణిపూర్‌కు చెందిన BJP MP అభ్యర్థించినప్పటికీ పార్లమెంటులో మాట్లాడటానికి అనుమతించలేదు. ఇది దురదృష్టకరం మాత్రమే కాదు, మొత్తం మణిపూర్‌కే అవమానం… ఇలాంటి సమయంలో మణిపూర్‌కు చెందిన సొంత ఎంపీ, విదేశాంగ శాఖ సహాయ మంత్రిని మాట్లాడకుండా బీజేపీ ఆపడం సిగ్గుచేటు.

సభలో మణిపూర్‌పై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఫోజ్ “ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, ప్రధాని మాట్లాడింది చాలా తక్కువ” అని అన్నారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధిని హైలైట్ చేయడానికి , వివిధ రాజకీయ పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ ని నిందించడానికే ప్రధానమంత్రి ఎక్కువ సమయం వెచ్చించారని ఆయన అన్నారు.

అవిశ్వాస తీర్మానం మొత్తం మణిపూర్‌పైనే. అతను [ప్రధానమంత్రి] ముందుగా మణిపూర్‌పై మాట్లాడి ఉండవలసిందని నేను అనుకున్నాను. ఆపై అతను మణిపూర్‌లో శాంతి, సాధారణ స్థితిని ఎలా తిరిగి తీసుకురావాలనే దానిపై తన ప్రణాళిక గురించి చెప్పడానికి మరికొంత సమయం ఇచ్చి ఉండాలని నేను అనుకున్నాను, ”అని NPF MP ఫోజ్ అన్నారు.

“ప్రజల భావోద్వేగాలకు ప్రతిస్పందనగా ప్రభుత్వం కొంచెం సున్నితంగా ఉంటుందని మాత్రమే మేము ఆశిస్తున్నాము. ప్రభుత్వం త్వరగా, కఠినంగా ఏదైనా చేయాలని మేము కోరుకుంటున్నాము. తద్వారా మణిపూర్ లో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావాలని లేదా కనీసం హింసను ఆపాలని మేము కోరుకుంటున్నాము, ”అని పిఫోజ్ అన్నారు.