నటుడు ప్రభాస్, నటి అనుష్క షెట్టిల అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ కలిసి నటించిన మూవీలన్నీ విజయవ౦త౦ అయ్యాయి. ఈ జంటను త
నటుడు ప్రభాస్, నటి అనుష్క షెట్టిల అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ కలిసి నటించిన మూవీలన్నీ విజయవ౦త౦ అయ్యాయి. ఈ జంటను తెరపై చూడాలని ఫ్యాన్స్ తహతహలాడుతుంటారు.
ఈ జంట ‘బిల్లా,’ ‘మిర్చి,’ ‘బాహుబలి’ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలలో కలిసి పని చేసింది. వారిద్దరి జంట ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి మారు పేరు తెచ్చుకుంది. వీళ్ళిద్దరినీ మరోసారి పెద్ద తెరపై జంటగా చూడాలని ఫ్యాన్స్ చాలా కాలంగా కోరుతున్నారు.
కాగా, అనుష్క శెట్టి, ప్రభాస్‌ల డైనమిక్ ద్వయం మరోసారి వెండితెరను పంచుకోవడానికి సిద్ధంగా ఉందనే వార్తలు వెలువడుతున్నాయి.ఒకవేళ ఇదే నిజమైతే అభిమానులకు పెద్ద ట్రీట్ అవుతుంది.
‘బాహుబలి’ దర్శకుడు శోబు యార్లగడ్డ ప్రభాస్, అనుష్క జంటగా మరో చిత్రాన్ని తీసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అతను ప్లాన్ చేస్తున్న కొత్త, అధిక-బడ్జెట్ మూవీలో వీళ్ళద్దరూ ప్రధాన పాత్రలు పోషించాలని అతను కోరుకుంటున్నాడు.
ఇంతకుముందు కలిసి పనిచేసి, తమ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి అత్యున్నత ప్రశంసలు అందుకున్న ఈ గొప్ప నటులు మళ్లీ ఒక సినిమా కోసం కలిస్తే, అది రికార్డ్ బద్దలు కొట్టే వసూళ్ళు సాధిస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ ప్రకటనపై ఇద్దరు నటీనటుల అభిమానులు, సినీ వ్యాపారులు ఆసక్తిగా ఉన్నారు. ఈ ఇద్దరు జంటగా పని చేసి మరో మ్యాజిక్ సృష్టించాలని ఎదురుచూస్తున్నారు.
అనుష్క శెట్టి, ప్రభాస్ ‘బాహుబలి’ ఫిల్మ్ ఫ్రాంచైజీలో దేవసేన, అమరేంద్ర బాహుబలిగా పురాణ పాత్రలు పోషించారు. ఆ మూవీల్లో వారి హాట్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘సాలార్’ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 AD’ లో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. ఇక అనుష్క షెట్టి మిస్ షెట్టి, మిస్టర్ పోలిషెట్టి మూవీలో నటిస్తోంది.