HomeTelanganaCinema

‘స్వామీ.. నదికి పోలేదా? .. లేదు, నదే సిటీకి వచ్చింది’

‘స్వామీ.. నదికి పోలేదా? .. లేదు, నదే సిటీకి వచ్చింది’

కొద్ది రోజులుగా భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమై పోతున్నది. రోడ్లు, కాలనీలు చెరువులైపోయాయి. జనం అష్టకష్టాలు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ లు అయిపోయి.

అక్కడ రోడ్లపై కార్లు పారుతున్నాయి
వరద ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం.
హైదరాబాద్ ప్రజలకు రెడ్ అలర్ట్

కొద్ది రోజులుగా భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమై పోతున్నది. రోడ్లు, కాలనీలు చెరువులైపోయాయి. జనం అష్టకష్టాలు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ లు అయిపోయి. పది నిమిషాల ప్రయాణం గంటలు పడుతోంది. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలియక జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండగా ఉన్నప్పుడు కార్యాలయానికి బయలుదేరిన వాళ్ళు తిరిగి ఇంళ్ళకు వచ్చేప్పుడు ట్రాఫిక్ లో కష్టాలు పడుతూ, అనేక గంటలు ప్రయాణం చేసి, తడిసి ముద్దయి ఇళ్ళకు చేరుతున్నారు.

ఈ అంశంపై సోషల్ మీడియాలో నెటిజనులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పంధిస్తున్నారు. కొందరు ఆగ్రహంగా స్పందిస్తే మరికొందరు వ్యంగ్య బాణాలు వదులు తున్నారు. మరి కొందరేమో ప్రభుత్వానికి మద్దతుగా నిలబడుతున్నారు.

ఇలా స్పందినవాళ్ళలో మామూలు వాళ్ళు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఉన్నారు. టాలీవుడ్ నటుడు నవ్ దీప్ ఇన్ స్టా గ్రాం లో చేసిన ఓ పోస్ట్ నెటిజనులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆయన కావాలనే పోస్ట్ చేశాడో పంచ్ కోసమే అలా పోస్ట్ చేశాడో తెలియదు కానీ ఆయన పంచ్ మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి సూటిగా తగిలేట్టే ఉంది.

నవ్ దీప్ పోస్ట్ చేసిన వీడియోలో ఓ యువతి.. ”స్వామీ.. నదికి పోలేదా?” అని నవ్ దీప్ ను అడిగితే.. ”అవసరం లేదే.. నదే సిటీకి వచ్చింది” అంటూ సమాధానం చెప్పారు. దాంతో ఆ యువతి నవ్వుతుంది. ఇక అదిచూసిన నెటిజనులు తెలంగాణ ప్రభుత్వంపై కామెంట్లు పెడుతున్నారు.