HomeTelangana

తెలంగాణలో ‘మిస్సింగ్’ పోస్టర్ల కలకలం.. వర్షాలు, వరదలు కూడా రాజకీయం

తెలంగాణలో ‘మిస్సింగ్’ పోస్టర్ల కలకలం.. వర్షాలు, వరదలు కూడా రాజకీయం

ప్రజలకు సహాయం చేయాల్సిన సమయంలో ఒకరిపై మరొకరు బురద జల్లుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 'మిస్సింగ్' పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.

బీజేపీతో బీఆరెస్ కు పొత్తు ఉండదు కేటీఆర్
మార్చ్ 1న ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమం.కెటిఆర్
ప్రజలు తప్పుచేశారని మాట్లాడటం BRS నేత‌లు మానుకోవాలి -KTR

ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదలు, ముంపు కారణంగా ప్రాణ నష్టం, జీవాల నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. భారీ వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇలాంటి సమయంలో కూడా రాజకీయ పార్టీలు తమ ధోరణి మార్చుకోలేదు. ప్రజలకు సహాయం చేయాల్సిన సమయంలో ఒకరిపై మరొకరు బురద జల్లుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ‘మిస్సింగ్’ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.

తెలంగాణలో ప్రజలు వరదలకు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 15 మందికి పైగా వరదల్లో చిక్కుకొని చనిపోయారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. అయినా సరే.. సీఎం కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రమైన విమర్శులు చేశారు. తెలంగాణలో వరదలు వెల్లువెత్తినా.. పత్తాలేని కేసీఆర్ అంటూ పోస్టర్లు తయారు చేసి ట్విట్టర్లో విడుదల చేసింది. వరద ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కు మంటూ ఉంటున్నారని.. బాధ్యతను విస్మరించి.. కేసీఆర్ పత్తా లేకుండా పోయారని ఆరోపించింది.

సీఎం కేసీఆర్‌పై ఇలాంటి ఆరోపణలు చేయడంపై అధికార బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారని.. ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయాలు ప్రతిపక్ష నాయకులకు అర్థం కావడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని కూడా పోస్టర్లు వెలిశాయి. మల్కాజిగిరి నియోజకవర్గంలో పలు గోడలపై ‘ఎంపీ మిస్సింగ్’ అంటూ పోస్టర్లు అంటించారు. 2020లో నియోజకవర్గాన్ని వరదలు ముంచెత్తినప్పుడు కూడా రేవంత్ రెడ్డి నియోజకవర్గాన్ని సందర్శించలేదని.. ఇప్పుడు కూడా వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. కనీసం పరామర్శకు కూడా రాలేదని మండిపడుతున్నారు. ఎంపీగా ఎప్పుడైనా మల్కాజిగిరి నియోజకవర్గంలో పర్యటించారా అని పోస్టర్లతో రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు.