HomePoliticsNational

మీ పిలుపు కోసం నిలువెల్ల చెవులై… కేసీఆర్ ను ఒదిలేసినట్టేనా ?

మీ పిలుపు కోసం నిలువెల్ల చెవులై… కేసీఆర్ ను ఒదిలేసినట్టేనా ?

కర్నాటక Karnataka లో దారుణమైన ఓటమి తర్వాత జనతా దళ్ (ఎస్) Janatha dal (s)నేత కుమార స్వామి Kumaraswamy ఆలోచనలు మారిపోయాయి. బీజెపిBJP, కాంగ్రెస్ CONGRES

త్వరలో బీజేపీలోకి నటి జయసుధ?
బీజేపీకి ఈటల రాజేందర్ గుడ్ బై చెప్పనున్నారా ?
ఏప్రెల్ లో లోక్ సభ ఎన్నికలు – ‍ స్పష్టం చేసిన కిషన్ రెడ్డి

కర్నాటక Karnataka లో దారుణమైన ఓటమి తర్వాత జనతా దళ్ (ఎస్) Janatha dal (s)నేత కుమార స్వామి Kumaraswamy ఆలోచనలు మారిపోయాయి. బీజెపిBJP, కాంగ్రెస్ CONGRESS వ్యతిరేక కూటమి కోసం బీఆరెస్ BRSఅధినేత కేసీఆర్ KCR తో చేతులు కలిపిన కుమార స్వామి ఇప్పుడు బీజేపీ కౌగలింత కోసం తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది. రేపు ఢిల్లీ లో జరగనున్న ఎన్ డీ ఏ NDA సమావేశానికి బీజేపీ తమను పిలవకపోవాడాన్ని తలుచుకుంటూ కుమిలిపోతున్నారు.

ప్రతిపక్షాలన్నీ కలిసి బీజేపీకీ వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటు దిశగా పయనిస్తున్న నేపథ్యంలో జేడీఎస్ నేత కుమార స్వామి మాత్రం బీజెపి వైపు అడుగులు వేస్తున్నారు. కుమారస్వామి ఎన్ డీ ఏ లో చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్డీయేలో చేరడం గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు. అయితే ఇంత వరకు ఎన్డీయే నుంచి ఆహ్వానం అందలేదని తెలిపారు. అయినా లోక్ సభ ఎన్నికలకు ఇంకా సమయముందని తొందరపడాల్సిన అవసరంలేదన్నారు. ప్రతి ఎన్నికలకు ప్రజల అభిప్రాయాలు మారిపోతున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆలోచనలు ఎలా మారుతాయో చూడాలని అన్నారు.

మరో వైపు విపక్షాల సమావేశాలపై మండిపడ్డారు కుమారస్వామి. విపక్షాల సమావేశం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారని.. బెంగళూరులో ఈ సమావేశాన్ని నిర్వహించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.
కాగా, భారత రాష్ట్ర సమితి BRS ఏర్పాటు సమయంలో కేసీఆర్ కుమార స్వామికి చాలా విలువ ఇచ్చారు. బీఆరెస్ జనరల్ బాడీ సమావేశానికి కుమారస్వామిని కూడా ఆహ్వానించి ఆయనను గౌరవించారు. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక కూటమిలో జనతాదళ్ (ఎస్) ను కలుపుకపోవడానికి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించారు. అప్పుడు దానికి సై అన్న కుమార స్వామి ఇప్పుడు తనను ఒదిలేసి బీజేపీ కౌగిలిలో ఒదిగిపోవాలని కలలుకంటుండటాన్ని కేసీఆర్ ఏ విధంగా ఎలా అర్దం చేసుకుంటారో ?