HomePoliticsCinema

మహిళల హక్కులంటూ గొంతుచించుకుంటున్న ఫేక్ లీడర్లను నమ్మొద్దు: పవన్ కళ్యాణ్ పై హీరోయిన్ పరోక్ష వ్యాఖ్యలు

మహిళల హక్కులంటూ గొంతుచించుకుంటున్న ఫేక్ లీడర్లను నమ్మొద్దు: పవన్ కళ్యాణ్ పై హీరోయిన్ పరోక్ష వ్యాఖ్యలు

పూనమ్ కౌర్ poonam kaur…తెలియని తెలుగువారు తక్కువే. టాలీవుడ్ లో హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ చాలా మూవీల్లోనే నటించారు. అయితే ఆమె మూవీల్

తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు ఖరారైనట్టేనా ?
తెలంగాణలో 32 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ
జనసేనలోకి ముద్రగడ పద్మనాభం ?

పూనమ్ కౌర్ poonam kaur…తెలియని తెలుగువారు తక్కువే. టాలీవుడ్ లో హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ చాలా మూవీల్లోనే నటించారు. అయితే ఆమె మూవీల్లో నటించడం వల్ల కన్నా సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల వల్లనే ఎక్కువ పాపులర్ అయ్యారు. ఆమె సినిమాల మీదనే కాదు రాజకీయాల మీద కూడా తరచుగా కామెంట్ చేస్తుంటారు.

ప్రధానంగా ఆమె పవన్ కళ్యాణ్ Pawan Klyan మీద చేసే విమర్శలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవడమే కాకుండా పవన్ ఫ్యాన్స్ ఆమెకు ధంకీలు కూడా ఇస్తుంటారు. ఎన్ని బెదిరింపులు, ధంకీలు వచ్చినా ఆమె పవన్ మీద పరోక్ష, ప్రత్యక్ష విమర్శలను మాత్రం ఆపలేదు.

మళ్ళీ ఇప్పుడామె పవన్ కళ్యాణ్ మీద పరోక్షంగా విరుచుకపడ్డారు. మహిళల కోసం పవన్ కళ్యాణ్ ఈ మధ్య మాట్లాడుతున్న మాటలపై ఆమె ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

”ఢిల్లీ పోరాడుతున్న మహిళా రెజ్లర్ల Wrestlers గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా,తమ ప్రయోజనం, సౌలభ్యం, స్వార్దం కోసం మహిళల సమస్యలపై పెద్దఎత్తున గొంతు చించుకునే నకిలీ నాయకుల పట్ల జాగ్రత్త వహించండి.” అని పూనమ్ కౌర్ poonam kaur ట్వీట్ చేశారు.

పూనమ్ కౌర్ poonam kaur ఇందులో డైరెక్ట్ గా ఎక్కడా పవన్ కళ్యాణ్ Pawan Klyan పేరు తీయకపోయినప్పటికీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆమెపై విరుచుకపడుతున్నారు. కొందరైతే బూతుల పంచాంగం కూడా విప్పారు.