నిన్న వరంగల్ లో పర్యటించిన ప్రధాని మోడీ అధికార బీఆరెస్ పై అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని ఆయన దుయ్యబట్
నిన్న వరంగల్ లో పర్యటించిన ప్రధాని మోడీ అధికార బీఆరెస్ పై అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని ఆయన దుయ్యబట్టారు. అయితే మోడీ చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఏ.చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు.
కేసీఆర్, అతని కుటుంబం అవినీతికి పాల్పడుతున్నట్టైతే కేంద్ర ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని చంద్ర శేఖర్ ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారని కేసీఆర్ చేసిన అవినీతిపై బీజేపీ సర్కార్ చర్యలు తీసుకుంటేనే బీజేపీని ప్రజలు నమ్ముతారని ఆయన అన్నారు. లిక్కర్ స్కాంలో అందరిని అరెస్టు చేసి ఒకరిద్దరిని ఎందుకు వదిలేశారో మోడీ జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చి అగ్రనాయకత్వం తీవ్రమైన తప్పు చేసిందని చంద్ర శేఖర్ అన్నారు. ఈటల రాజేందర్ కు లేని పదవి సృష్టించి ఇవ్వడం లో అర్దం ఏంటని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుండి తప్పైంచడాన్ని అందరూ వ్యతిరేకిస్తు7న్నారు. సంజయ్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. తనకు ఇష్టం లేని అధ్యక్షపదవి ఇవ్వడం పట్ల కిషన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని ఆయన తెలిపారు.
5 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు మంత్రిగా పని చేసిన తనకు ప్రధాని సభకు కనీసం పాస్ కూడా ఇవ్వలేదని, దళిత నాయకులపట్ల ఇంత వివక్ష చూపిస్తే బీ9జేపీకి దళితులు ఓట్లెలా వేస్తారని చంద్రశేఖర్ ప్రశ్నించారు. బీజేపీ నాయకత్వం తన పద్దతి మార్చుకోకపోతే తెలంగాణలో బీజేపీ బతికి బట్టకట్టడం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు.
తాను పార్టీ మారుతున్నాననే వార్తలపై స్పందించిన చంద్రశేఖర్ మాజీ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళే పార్టీలు మారారని తాను మారితే ఏమవుతుందని ప్రశ్నించారు.