ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ‘మినీ ఇండస్ట్రియల్ పార్క్‌మంత్రి శ్రీధర్ బాబు
- ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ‘మినీ ఇండస్ట్రియల్ పార్క్’ను మహిళల కోసం అభివృద్ధి చేస్తాం. ఈ పార్కుల్లో ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం ప్రత్యేకంగా కేటాయిస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.*లక్డీకాపూల్ రెడ్ హిల్స్ లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్ టీసీసీఐ) భవన్ లో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఎంటర్ ప్రైజెస్ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన “రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎంఎస్ఎంఈ(ఎంఎస్ఎంఈ) 2024: ఎ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ” కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీలు ఎదిగితేనే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందని చేవెళ్ల డిక్లరేషన్ లో దళితులకిచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కచ్చితంగా నెరవేరుస్తుందన్నారు. కాంగ్రెస్ అంటేనే దళితులు.. దళితులు అంటేనే కాంగ్రెస్. దళితుల అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు.
- * ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే.. మరోవైపు సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించాం. 2017 నుంచి సబ్సిడీల కింద పారిశ్రామికవేత్తలకు అందాల్సిన బకాయిలు రూ.4500 కోట్లకు పైగా ఉన్నాయని, వీటిలో రూ.2200 కోట్లు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకే రావాల్సి ఉండగా,మేం అధికారంలోకి రాగానే ఈ బకాయిల చెల్లింపుపై దృష్టి సారించా మన్నారు.వచ్చే నెల(మార్చి) చివరి నాటికి రూ.300 కోట్లు చెల్లిస్తామన్నారు.
- దేశంలో ఎక్కువ మంది కార్మికులు ఎంఎస్ఎంఈ రంగంలోనే ఉపాధి పొందుతున్నారని, కానీ.. దురదృష్టవశాత్తు ఇప్పటీ వరకూ ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకంగా పాలసీ అంటూ ఏదీ లేదని, రాహుల్ గాంధీ సూచనల మేరకు మేం ప్రత్యేకంగా పాలసీని తీసుకొచ్చాం మున్నా రు. క్షేత్రస్థాయిలో శాస్త్రీయంగా అధ్యయనం చేసి.. నిపుణులను భాగస్వామ్యం చేసి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ పాలసీని రూపొందించామని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోరిక మేరకు.. వారికి మరింత ప్రయోజనం చేకూరేలా ఈ పాలసీ ఆపరేషనల్ గైడ్ లైన్స్ ను తయారు చేస్తామని,
- ప్రొక్యూర్ మెంట్, కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తా మన్నారు. శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రత్యేక పాలసీలను తీసుకొస్తామని, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని,పరిశ్రమల స్థాపనలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తా మన్నారు. స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేసి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న మానవ వనరులను అందిస్తామని, కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి వెల్లడించారు.
- బ్యాంక్ ల నుంచి రుణాలు పొందటంలో ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని, కుటీర పరిశ్రమలకు అండగా నిలుస్తామని,వాటిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసానిచ్చారు.
- ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, అధికారులతో కూడిన ప్రత్యేక బృందం తమిళనాడు, కర్ణాటకలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తుందని, ఆయా ప్రభుత్వాలు దళిత పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహాకాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేస్తుందన్నారు .ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం దళిత పారిశ్రామికవేత్తలకు మరింత ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
- ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, కడియం శ్రీహరి, రాంచందర్ నాయక్, మందుల సామెల్, వెడ్మ భోజ్జు, నాగరాజు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ‘మినీ ఇండస్ట్రియల్ పార్క్
మంత్రి శ్రీధర్ బాబు