HomeTelanganaPolitics

విద్యార్థులు యువతకు నైపుణ్యమైన శిక్షణ..సింగపూర్ సంస్థతో ప్రభుత్వ ఒప్పందం

సింగపూర్ సంస్థతో ప్రభుత్వ ఒప్పందం సింగపూర్: విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగ సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంగ్

తెలంగాణ నుంచి నరేంద్రమోడీ, ప్రియాంకా గాంధీ పోటీ ?
మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ఓడిపోతుందని తెలిసీ ఎందుకు ప్రవేశపెట్టారో తెలుసా ?
ఎన్నికలకు కొద్ది ముందు కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్న కేసీఆర్

సింగపూర్ సంస్థతో ప్రభుత్వ ఒప్పందం

సింగపూర్: విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగ సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సింగపూర్ ప్రభుత్వ ఆధీనంలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటిఇ) సంస్థతో శుక్రవారం నాడు ఎంఓయు కుదుర్చుకుంది. సిఎం రేవంత్ రెడ్డి, ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పెషల్ సిఎస్ జయేశ్ రంజన్ ల సమక్షంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, ఐటిఇ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. సింగపూర్ ఐటిఇ పదో తరగతి చదివే విద్యార్ధుల స్థాయి నుంచి, చదువు పూర్తి చేసిన యువత, ఆసక్తి ఉన్న ఏ వయసు వారికైనా పరిశ్రమలు, ఐటి సంస్థల సహకారంతో జాబ్ రెడీ శిక్షణనిస్తుంది. ‘స్కిల్స్ ఫర్ ఫూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్’ అనే నినాదంతో పనిచేస్తున్న ఐటిఇ లో ప్రస్తుతం 28 వేల మంది శిక్షణ పొందుతున్నారు. మొత్తం వంద ఫుల్ టైమ్ కోర్సులకు ఆన్లైన్, క్యాంపస్ శిక్షణ దొరుకుతుంది. ఐటిఇకి ఐదు వేల పరిశ్రమలతో భాగస్వామ్యం ఉంది. పరిశ్రమలు తమకు అవసరమైన మానవ వనరులకు నేరుగా శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అదే స్పూర్తితో ఏర్పాటైన యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (yisu.in) తన శిక్షకులకు ఐటిఇ తో ట్రెయినింగ్ (ట్రెయినింగ్ ఫర్ ట్రెయినర్స్) ఇప్పించేలా ఒప్పందరం కుదుర్చుకుంది. తాజా ఎంఓయు వల్ల సింగపూర్ ఐటిఇ పాఠ్యాంశాలను (కరికులమ్) మనం ఉపయోగించుకునే వీలు కలుగుతుంది.