HomeTelanganaUncategorized

రేపటి నుంచి రైతు పండుగ…మూడు రోజుల విజయోత్సవాలు

రేపటి నుంచి రైతు పండుగ…మూడు రోజుల విజయోత్సవాలు

రేపటి నుంచి రైతు పండుగ మూడు రోజుల విజయోత్సవాలు రైతులకు అవగాహన కల్పించేలా వేడుకలు తొలి ఏడాదిలో రైతుల సంక్షేమానికి రూ.55 వేల కోట్లు ఖర్చు చేసి

తెలంగాణలో హిందుత్వ దూకుడు తగ్గించడం, అవసరమైతే పార్లమెంటులో BRS మద్దతు పొందడం…ఇవీ ఇప్పుడు బీజేపీ లక్ష్యాలు
ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి కేసీఆర్ నివాళి..
కుడా ఆధ్వర్యంలో యుని సిటీ ఫ్లాట్ల వేలం…..● చైర్మన్ వైస్ చైర్మన్ సమక్షంలో వేలం పాటల నిర్వహణ….

రేపటి నుంచి రైతు పండుగ

మూడు రోజుల విజయోత్సవాలు

రైతులకు అవగాహన కల్పించేలా వేడుకలు

తొలి ఏడాదిలో రైతుల సంక్షేమానికి రూ.55 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రజా ప్రభుత్వం

దేశానికే ఆదర్శంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంగా ప్రజాప్రభుత్వం మూడు రోజుల పాటు రైతు పండుగను నిర్వహిస్తోంది. అన్ని జిల్లాల రైతులు ఈ వేడుకల్లో పాలుపంచుకునేందుకు వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలన్నీ భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి.

రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కల్పించేందుకు ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

రైతు సదస్సులో భాగంగా 25 వివిధ విభాగాల అధ్వర్యంలో 150 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో పాటు వివిధ జిల్లాల నుంచి ఆదర్శ రైతులు ఈ సదస్సులో పాలుపంచుకుంటారు. యూనివర్సిటీలతో పాటు వ్యవసాయ, అనుబంద శాఖలన్నీ ఇందులో పాల్గొంటాయి.

తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా ఉండేలా.. రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం తొలి ఏడాదిలోనే భారీగా నిధులు ఖర్చు చేసింది. దాదాపు రూ.54280 కోట్లతో వివిధ పథకాలను అమలు చేసింది.

దేశంలోనే వరిసాగు విస్తీర్ణంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది.

దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతులకు ఒకే సారి రూ. 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసింది. కేవలం 27 రోజుల్లోనే దాదాపు 22.22 లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు రూ.17,870 కోట్ల రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఇటీవలే వేములవాడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

అధికారం చేపట్టిన వెంటనే రైతులను బాగు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అమల్లోకి తెచ్చిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పథకాన్ని నిరాటంకంగా ప్రజా ప్రభుత్వం కొనసాగించింది. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తుకు ఈ ఏడాది రూ.10444 కోట్లు సబ్సిడీగా చెల్లించింది.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తొలి మూడు నెలల్లోనే ప్రభుత్వం రైతు భరోసా నిధులను పంపిణీ చేసింది. యాసంగి సాగుకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను ఎకరానికి రూ. 5 వేల చొప్పున రైతులందరి ఖాతాలో జమ చేసింది. మొత్తం 1,57,51,000 ఎకరాలకు రూ.7625 కోట్ల నిధులను విడుదల చేసింది. మొత్తం 69,86,519 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ చేసింది. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా రైతు భరోసా నిధులను మే నెల మొదటి వారంలోనే జమ చేసింది.

ప్రకృతి విపత్తులతో, క్రిమికీటకాలతో పంటలు నష్టపోతే రైతులు ఇబ్బంది పడకుండా.. నష్ట పరిహారం అందేలా పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించింది. రాష్ట్రంలోని రైతుల తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు రూ. 1,300 కోట్లు కేటాయించింది.

రైతుకు ఆపద వస్తే రైతు కుటుంబాలు ధీమాగా ఉండేలా రైతు బీమాను అమలు చేసింది. ఇందులో భాగంగా ఎవరైనా రైతులు ఏ కారణంతో మరణించినా రూ. 5 లక్షల బీమా పరిహారం ఆ బాధిత కుటుంబానికి అందిస్తోంది. జీవిత బీమా కంపెనీకి రైతు బీమా పథకం ప్రీమియంగా రూ. 1,455 కోట్లు చెల్లించింది.

రైతులు దళారుల చేతిలో మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను కట్టుదిట్టంగా నిర్వహించింది. గతంలో కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు నెలకొల్పింది. రైతులు నెలలకొద్దీ ఎదురు చూడకుండా డబ్బులను వేగంగా చెల్లించి రికార్డు నెలకొల్పింది.
రబీ సీజన్కు సంబంధించి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు కేవలం మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లించింది. రాష్ట్రంలో దాదాపు 9 లక్షల మంది రైతుల నుంచి రూ.10547 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది.

వానాకాలం సీజన్ నుంచి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించింది. కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లు అమ్మిన రైతులకు బోనస్ చెల్లించింది. దీంతో రాష్ట్రంలో సన్నరకాల వరిసాగు విస్తీర్ణం పెరిగింది.

రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందించేందుకు, అధికారులు నేరుగా క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకునేందుకు రైతు నేస్తం పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. అన్ని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను అమర్చనుంది. తొలి విడతగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2601 రైతు వేదికల నుంచి రైతులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడే ఏర్పాట్లు చేసింది.

అన్ని మండలాల్లో వ్యవసాయ అధికారులు ఉండేలా 148 మంది వ్యవసాయ అధికారులను నియమించారు. ఉద్యానవన శాఖలో 18 మంది హార్టికల్చర్ ఆఫీసర్‌లను నియమించింది.

ఆయిల్ పామ్ కస్టమ్స్ సుంకం సంబంధించిన సమస్యలు పరిష్కరించటం ద్వారా ఆయిల్ పామ్ రైతులకు టన్నుకు 2000 అదనపు లబ్ధి చేకూరే నిర్ణయం తీసుకుంది. అశ్వారావుపేట ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీలో క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం.

వ్యవసాయ రంగం అభివృద్ధి సలహాలు, సూచనల కోసం కోదండరెడ్డి సారధ్యంలో వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసింది.