HomeTelanganaPolitics

ఎవర్ నార్త్ గ్లోబల్ సామర్థ్య కేంద్రం ఏర్పాటుతో వెయ్యి మందికి కొత్తగా ఉద్యోగాలు – మంత్రి శ్రీధర్ బాబు.

ఎవర్ నార్త్ గ్లోబల్ సామర్థ్య కేంద్రం ఏర్పాటుతో వెయ్యి మందికి కొత్తగా ఉద్యోగాలు – మంత్రి శ్రీధర్ బాబు.

నూతన ఆవిష్కరణలకు ప్రపంచ గమ్య స్థానంగా హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిర పర్చుకుంటోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంతోషం వ్యక్తం చేసార

మూడు నెలల మంత్రిగా ‘పట్నం’ ప్రమాణస్వీకారం
ఈ రోజు ఆటో కార్మికులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం
భాష రాని మంత్రులు “చరిత్ర”నే మార్చేశారు

నూతన ఆవిష్కరణలకు ప్రపంచ గమ్య స్థానంగా హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిర పర్చుకుంటోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంతోషం వ్యక్తం చేసారు హైటెక్ సిటీలోని సత్త్వ నాలెడ్జ్ పార్కులో ఎవర్‌నార్త్ ఆరోగ్య సేవల సంస్థ ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి గ్లోబల్ సామర్థ కేంద్రాన్ని(జిసిసి) ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. మొదటి దశలో ఎవర్ నార్త్ 1,000 మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ఆధునిక కేంద్రం హైదరాబాద్‌లోని నిపుణుల సామర్థ్యాన్ని వినియోగించుకుని ఆరోగ్యరంగంలో ఐటీ వినియోగాన్ని మరింత విస్తృతపరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. బెంగళూరులోని సిగ్నా హెల్త్ సొల్యూషన్స్ సంస్థ, అంతర్జాతీయ ఆరోగ్య వ్యాపారానికి డేటా, అనలిటిక్స్, లాంటి సాంకేతిక సేవలను అందించే కేంద్రంగా ఎవర్ నార్త్ పనిచేస్తుందని ఆయన వివరించారు. సిగ్నా సంయుక్త భాగస్వామ్యం ద్వారా ఎవర్ నార్త్ 1.9 కోట్ల భారతీయులకు ఆరోగ్య సేవలను అందిస్తోంది. 75,000 మంది ఉద్యోగులు, 30కు పైగా దేశాల్లో 18.6 కోట్ల వినియోగదారులతో, ఆరోగ్య సేవల రంగంలో నూతన ఆవిష్కరణలకు, ఇంటెలిజెన్స్‌కు దోహదం చేస్తోందని శ్రీధర్ బాబు వెల్లడించారు. ఎవర్ నార్త్ జిసిసి కేంద్రం 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యకలాపాలు నిర్వహించడం వల్ల పరోక్షంగా కూడా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని శ్రీధర్ బాబు తెలిపారు. కార్యక్రమంలో సిగ్నా గ్రూప్ ప్రధాన సమాచార అధికారి నోయెల్ ఎడర్, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, రాష్ట్ర లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.