HomeTelanganaPolitics

నాన్న ఆశయాలు కొనసాగిద్దాం -అమరుడు సాయిబాబా కూతురు మంజీరా

నాన్న ఆశయాలు కొనసాగిద్దాం -అమరుడు సాయిబాబా కూతురు మంజీరా

ఈ నెల 12న అమరుడైన డాక్టర్ సాయిబాబా సంస్మరణ సభలు ఈ రోజు అనేక చోట్ల జరిగాయి. కరీంనగర్, సిద్దీపేట, నల్గొండ, సూర్యాపేట, గద్వాల, రాజమండ్రి తదితర చోట్ల జరి

మావోయిస్టుల దాడిలో చనిపోయిన పోలీసులు 35 మంది కాదు నలుగురే – అధికారుల ప్రకటన‌
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
తెలంగాణ: ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్

ఈ నెల 12న అమరుడైన డాక్టర్ సాయిబాబా సంస్మరణ సభలు ఈ రోజు అనేక చోట్ల జరిగాయి. కరీంనగర్, సిద్దీపేట, నల్గొండ, సూర్యాపేట, గద్వాల, రాజమండ్రి తదితర చోట్ల జరిగాయి. కరీంనగర్, సిద్దీపేటలలో జరిగిన సభల్లో సాయిబాబా కూతురు మంజీరా మాట్లాడుతూ, తన తండ్రి నడిచిన బాటలోనే తాను నడుస్తానన్నారు. తన తండ్రి మరణించాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాన్న మంజీరా నాన్న ఆశయాలను మనందరం కలిసి కొనసాగిద్దామని పిలుపు నిచ్చారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సాయిబాబా సంస్మరణ సభ కు విరసం నేత బాలసాని రాజయ్య అధ్యక్షత వహించారు.
సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి, సాయిబాబా కుమార్తె మంజీర, పౌర హక్కుల, మానవ హక్కుల సంఘం నేతలు, వివిధ ప్రజా సంఘాల నేతలు, రచయితలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, విద్యావంతులు, మేధావులు, ప్రొఫెసర్ సాయిబాబా అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సాయిబాబా ఉద్యమ సేవలను, హక్కుల సాధనకై ఆయన చేసిన సేవలను కొనియాడారు. తొంభై శాతం వికలాంగుడైన ఒక నిర్దోషి ప్రొఫెసర్ సాయిబాబాను ఈ ప్రభుత్వాలు దశాబ్ద కాలం పాటు అక్రమంగా జైల్లో నిర్బంధించి రక రకాలుగా హింసించడం, సరైన వైద్యం కూడా అందించక పోవడం బాధాకరం అన్నారు. ఆయన ఆశయాల సాధన దిశగా ఉద్యమాలు, పోరాటాలు కొనసాగించి మానవ హక్కులు, ప్రజా స్వేచ్చలను సాధించినప్పుడే సాయిబాబా కు నిజమైన జోహార్లు అర్పించినట్లు అని సభికులు ముక్త కంఠంతో అన్నారు. ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు సమిష్టి కృషితో పోరాటాలు కొనసాగించి ఆయన కలలు, ఆశయాలు నెరవేర్చాలని కోరారు. సాయిబాబా కుమార్తె మంజీర మాట్లాడుతూ సాయిబాబా ను అన్యాయంగా, అక్రమంగా, క్రూరత్వంగా ఈ దేశ పోలీసులు అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్ళిన తీరును, జైల్ నిర్బంధంలో సాయిబాబా అనుభవించిన నిర్భంధం హింసలను, వివరించారు.

ప్రొఫెసర్ సాయిబాబా జీవిత మంతా ఎలా కృషి చేశారు, ఆదివాసీల కోసం, హక్కుల సాధన కోసం, ప్రజలపై సామ్రాజ్య వాద యుద్ధాలను, సాయిబాబా ప్రజల కోసం, హక్కుల కోసం రాసిన కవితలను, రచనలను, ఆయన సాహిత్యాన్ని మంజీర కండ్లకు కట్టినట్లు తెలిపారు. నిరంతరం సాయిబాబా తపన, ఆచార్యుడుగా ఆయన చేసిన సేవలను, తాను చిన్న తనం నుండి చూసిన సాయిబాబా ఉద్యమాల నేపథ్యాన్ని మంజీర వివరంగా సభికులకు తెలియ జేశారు.

ప్రొఫెసర్ సాయిబాబా సంస్మరణ సభకు హాజరైన వివిధ ప్రజా సంఘాల నేతలు, హక్కుల సంఘాల నేతలు, రచయితలు, మేధావులు, విద్యావంతులు, అభిమానులు సాయిబాబా సేవలను, ఉద్యమాలను కొనియాడారు.

పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమార స్వామి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీపతి రాజగోపాల్, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్, డిటిఎఫ్ నాయకులు రవి శంకర్, వీరగోణి పెంటయ్య, ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, పౌర హక్కుల సంఘం నేతలు నార వినోద్, వేల్పుల బాలయ్య, సుచరిత, బొడ్డుపల్లి రవి, గడ్డం సంజీవ్, లక్ష్మణ్, కడ రాజన్న, పొన్నం రాజమల్లు, బండారి రాజలింగం, మానవ హక్కుల వేదిక నాయకులు సలుపల రమేష్, కొయ్యాడ కొమురయ్య, సమ్మయ్య, సిపిఎం కరీం నగర్ జిల్లా కార్యదర్శి వాసుదేవా రెడ్డి, అధిక సంఖ్యలో రచయితలు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, విద్యావంతులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.