వైఎస్ జగన్ ఆయన సోదరి షర్మిల మధ్య కొంత కాలంగా సాగుతున్న యుద్దం ఆగిపోతుందని, ఇద్దరి మధ్య ఆస్తిపంపకాలకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయని వచ్చిన వార్తలన్నీ
వైఎస్ జగన్ ఆయన సోదరి షర్మిల మధ్య కొంత కాలంగా సాగుతున్న యుద్దం ఆగిపోతుందని, ఇద్దరి మధ్య ఆస్తిపంపకాలకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయని వచ్చిన వార్తలన్నీ ఉట్టివే అని తేలిపోయింది. ఇప్పుడు చెల్లిపైనే కాదు, తల్లిపైన్ అకూడా జగన్ కేసు ఫైల్ చేశాడు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటాల కేటాయింపుకు సంబంధించిన వివాదంపై వైఎస్ జగన్, ఆయన భార్య భారతిలు కలిసి షర్మిల, విజయమ్మలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు.గ్రంధి కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీలో షర్మిల, విజయమ్మలకు వాటాలు ఇచ్చే ఉద్దేశం తనకు లేదని జగన్ పేర్కొన్నారు.కంపెనీ షేర్ విలువలు బాగా పెరగడానికి తామే కారణమని, ఇప్పుడు ఆ షేర్లను షర్మిలతో పంచుకోబోమని జగన్, భారతి వాదిస్తున్నారు.
సోదరిపై ప్రేమతో రెండువేలపందొమ్మిది ఆగస్టులో షర్మిలకు కొన్ని షేర్లు ఇచ్చేందుకు తాను అంగీకరించానని కానీ షర్మిల తనకు వ్యతిరేకంగా ప్రత్యేక రాజకీయ గుర్తింపును కోరుకున్నందున, తనకు వ్యతిరేకంగా పోరాడుతున్నందున ఆమెకు షర్మిల, విజయమ్మలకు ఇకపై వాటాలు ఇచ్చే ప్రసక్తే లేదని జగన్, భారతి స్పష్టం చేశారు.