తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లోనే కాదు ఏపీ ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా ఇప్పుడు నారా లోకేష్ హవానే నడుస్తోంది. ఒకప్పుడు పప్పుసుద్ద అని ముద్రవేసినవాళ్ళే ఇ
తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లోనే కాదు ఏపీ ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా ఇప్పుడు నారా లోకేష్ హవానే నడుస్తోంది. ఒకప్పుడు పప్పుసుద్ద అని ముద్రవేసినవాళ్ళే ఇప్పుడు ఆయన దగ్గర చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. రెండువేల పద్నాలుగునుంచే చంద్రబాబు లోకేష్ ను ప్రొజెక్ట్ చేస్తున్నప్పటికీ రెండువేల పందొమ్మిది తర్వాత లోకేష్ పట్టు పార్టీపై పెరిగింది. చంద్రబాబు అరెస్టు తర్వాత మొత్తం పార్టీని లోకేష్ తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీ టిక్కట్లు ఎవరికివ్వాలన్నది లోకేషే నిర్ణయించాడన్నది టాక్. సీనియర్లను పక్కన పెట్టి వారి వారసులకు, తన మాట వినేవారికి టిక్కట్లు ఇచ్చాడు. మంత్రి వర్గంలో కూడా లోకేష్ ముద్ర కనపడుతోంది. మంత్రులు కూడా ప్రస్తుతం లోకేష్ ఆదేశాలను అనుసరిస్తున్నారు. ఆయనను దాటేసే వాళ్ళను పక్కకు పెడుతున్నాడు లోకేష్. ఇప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో లోకేష్ విధేయులదే హవా నడుస్తోంది. గతంలో వైసీపీ వైపు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు టీడీపీలో చేరుదామనుకునే వాళ్ళ పట్ల బాబు కొంత సానుకూలంగా ఆలోచిస్తున్నప్పటికీ లోకేష్ మాత్రం వాళ్ళను దగ్గరికి కూడా రానివ్వడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలంతా లోకేష్ ను నాయకుడిగా అంగీకరించడమే కాదు ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కంటున్నారు. చంద్రబాబు కూడా లోకేష్ ను రాజును చేయడానికి పెద్ద ప్లాన్ తోనే వస్తున్నట్టు తెలుస్తోంది.