HomeTelangana

FTL పరిధిలో ఉన్న తన‌ ఆస్తులు కాపాడుకోవడానికే హరీశ్ రావు ఆరాట‌మా ?

FTL పరిధిలో ఉన్న తన‌ ఆస్తులు కాపాడుకోవడానికే  హరీశ్ రావు ఆరాట‌మా ?

బీఆరెస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు ఎఫ్ టీఎల్ పరిధిలో ఆస్తులున్నందు వల్లే ఆయన హైడ్రాపై పోరాటం చేస్తున్నారా ? కూల్చివేతలను వ్యతిరేకిస్తున్నారా ? ఆయన పోరాటమ

ఈ నెల 16న బీఆరెస్ భారీ బహిరంగసభ, ఆరోజే మేనిఫెస్టో విడుదల
BRSలోకి నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి.. కేసీఆర్ తో సమావేశం
BRS టూ BRS వయా కాంగ్రెస్

బీఆరెస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు ఎఫ్ టీఎల్ పరిధిలో ఆస్తులున్నందు వల్లే ఆయన హైడ్రాపై పోరాటం చేస్తున్నారా ? కూల్చివేతలను వ్యతిరేకిస్తున్నారా ? ఆయన పోరాటమంతా తన ఆస్తులను రక్షించుకోవడం కోసమేనా ? హిమాయత్ సాగర్ ఎఫ్ టీ ఎల్ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెషన్ లో హరీష్ రావుకు వాటాలు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. హిమాయత్ సాగర్ జలాశయంలోని నిర్మాణాలను కూల్చివేసే పనిలో హైడ్రా బిజీగా ఉండటంతో, తన కన్వెషన్ ను కూల్చేస్తారన్న భయంతో హరీష్ రావు ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ అక్రమ ఆస్తులను కాపాడుకునేందు కోసమే హరీష్ హైడ్రా విషయంలో రాద్దాంతం చేస్తున్నారని అనిల్ కుమార్ ఆరోపించారు. తన ఆస్తుల రక్షణ కోసం అమాయక పేద ప్రజలను రోడ్డుమీదకు లాగుతున్నారని విమర్శించారు. హైడ్రా విషయంలో బీఆర్ఎస్ చేస్తోన్న ఉద్యమం ఓ బోగస్ అంటూ కొట్టిపారేశారు.

ఇదే నిజమైతే హరీశ్ రావు పోరాటంలోని డొల్లతనం తేలిపోతుంది. ఒకవేళ అనీల్ కుమార్ యాదవ్ ఆరోపణలు నిజంకాకపోతే దానిని హరీశ్ రావు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అంతే కాదు ఈ విషయంపై హైడ్రా ఛీఫ్ రంగనాథ్ కూడా నిజానిజాలు బైటపెట్టాలి.