HomeTelanganaUncategorized

ఇల్లందులో విధ్వంసం.కౌన్సిలర్ల కిడ్నాప్. 144 సెక్షన్

ఇల్లందులో విధ్వంసం.కౌన్సిలర్ల కిడ్నాప్. 144 సెక్షన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాసంలో హైడ్రామా నడుస్తోంది. అవిశ్వాసం కు మద్దతు గా వచ్చిన కొంతమందికౌన్సిలర్లను కాంగ్రెస్ నాయకుల

కరెంట్ బిల్లులు చెల్లించొద్దన్న కేటీఆర్ పై మంత్రి భట్టి ఆగ్రహం
హిమాన్షు అన్నా ప్లీజ్ మా స్కూల్ నూ దత్తత తీసుకోవా !
అమ్మా…. అలా నిజాలు చెప్పడం మానేయి, లేదంటే వాళ్ళు నిన్ను చంపేస్తారు… తల్లి కోసం పసివాడి హృదయ ఘోష‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాసంలో హైడ్రామా నడుస్తోంది. అవిశ్వాసం కు మద్దతు గా వచ్చిన కొంతమంది
కౌన్సిలర్లను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కిడ్నాప్ చేసారు. మున్సిపల్ చైర్మన్ డీవీ పై అవిశ్వాసం కోరిన కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రక్రియ సవ్యంగా జరిగేందుకు తమకు రక్షణ కల్పించాలని హైకోర్టు ను ఆశ్రయించారు. హైకోర్టు సదరు కౌన్సిలర్ లకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఇల్లందు పట్టణంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ ను విధించారు . కొద్ది క్షణాలలో అవిశ్వాసం ప్రక్రియ మొదలౌతుంది అనగా ఎంపీడీవో కార్యాలయం పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి, అద్దాలు ధ్వంసం చేశారు . హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా పోలీసుల ముందే
ఒక సిపిఐ, ఇద్దరూ టిఆర్ఎస్ కౌన్సిలర్లను లాక్కెళ్లారు. ప్రజాస్వామ్య రక్షణ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇదే తీరున వ్యవహరించడం వివాదాస్పదంగా మారింది. సంఘటన స్థలానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకురాలు హరిప్రియ నాయక్ కిడ్నాప్ ఘటనపై పోలీసులను నిలదీశారు. అవిశ్వాసం ప్రక్రియను సజావుగా సాగేందుకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు . హైకోర్టు ఆదేశాలు ఉన్నా , పోలీసులు 144 సెక్షన్ విధించినా అధికారపార్టీ నాయకులకు అవేవి వర్తించలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.