పోలీసుల సహకారంతో సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.
పోలీసుల సహకారంతో సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.
100 మంది పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి దాటిన తర్వాత బీఆర్‌ఎస్ కార్యాలయానికి చేరుకుని బుల్‌డోజర్‌తో కూల్చివేశారు. బీఆరెస్ కార్యాలయం నిర్మించిన స్థలం దేవాదాయ శాఖకు చెందిందని అధికారులు తెలిపారు.సరైన అనుమతులు లేకుండా ఈ భవనం నిర్మించిన కారణంగా కూల్చి వేశామని వారు స్పష్టం చేశారు.
కాగా, బీఆర్‌ఎస్ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. రెండేళ్ల క్రితం మల్లాపురంలో 150 గజాల్లో పార్టీ మండల కార్యాలయాన్ని నిర్మించారన్నారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే దేవాదాయ శాఖ అధికారులు బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని కూల్చివేశారని విమర్శించారు.
జిల్లాకు చెందిన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అధికార కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ కార్యాలయం కూల్చివేతలో ఆలేర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (కాంగ్రెస్) పాత్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.