HomeTelanganaPolitics

బీజేపీతో బీఆరెస్ కు పొత్తు ఉండదు కేటీఆర్

బీజేపీతో బీఆరెస్ కు పొత్తు ఉండదు కేటీఆర్

బీఆర్‌ఎస్ బీజేపీకి బీ-టీమ్ అనే ఆరోపణలను కొట్టిపారేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశ

BRS వైపే తెలంగాణ… ‘జనతా కా మూడ్’ సర్వే
బీజేపీలో చేరిన బీఆరెస్ ఎమ్మెల్యే
తెలంగాణకు జాతీయ పసుపు బోర్డు… ప్రకటించిన ప్రధాని మోడీ

బీఆర్‌ఎస్ బీజేపీకి బీ-టీమ్ అనే ఆరోపణలను కొట్టిపారేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌కు గతంలో బీజేపీతో పొత్తు లేదని, భవిష్యత్తులో కూడా పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు బీజేపీ ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ ఓడించిందని ఆయన గుర్తు చేశారు.

బిజెపి మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. బిఆర్‌ఎస్ నిజమైన లౌకికవాదానికి అండగా నిలుస్తుందని అన్నారు. బిజెపి హిందువుల ఏకైక ప్రతినిధి అనే భావనను ఆయన తోసిపుచ్చారు.

మనం కూడా పునరుద్ధరించిన యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవాన్ని రాజకీయం చేసి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ‘అక్షింతలు’ పంచి ఉంటే, నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో మన గెలుపు అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉండేవ‌ని ఆయన వ్యాఖ్యానించారు.