HomeNational

దేశంలోనే అత్యంత పొడవైన వంతెన ప్రార౦భించిన ప్రధాని

దేశంలోనే అత్యంత పొడవైన వంతెన ప్రార౦భించిన ప్రధాని

ముంబైలో నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ప్రారంభించారు.17,840 కోట్ల రూపాయలతో నిర్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి

I.N.D.I.A కూట‌మి కీలక నిర్ణయాలు
గౌరీ లంకేష్ ,దభోల్కర్, పన్సారే, కల్బుర్గి, హత్యల వెనక ఉన్నకుట్ర ను పరిశీలించాలని సీబీఐని ఆదేశించిన‌ సుప్రీంకోర్టు
ఇంత దారుణమా ? హిందూ, ముస్లింలు స్నేహం కూడా చేయొద్దా ?

ముంబైలో నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ప్రారంభించారు.17,840 కోట్ల రూపాయలతో నిర్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి సేవరీ-నవ శేవా అటల్ సేతు, దేశంలోనే పొడవైన వంతెన. దక్షిణ ముంబైని నవా-షేవాతో కలుపుతూ దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నవీ ముంబైలో ప్రారంభించారు.

ఈ ఆరు లేన్ల ట్రాన్స్-హార్బర్ వంతెన 21.8 కి.మీ పొడవు ఉంది. ఇందులో 16.5 కి.మీ పొడవు సముద్ర-లింక్ ఉంది.
ఈ వంతెన రాబోయే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. ముంబై , పూణే మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ఇది ముంబై పోర్ట్, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఈ వంతెనకు 2016 డిసెంబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.