HomeNational

బిజెపి విధానాలు దేశంలో హింస, హక్కుల దుర్వినియోగానికి దారితీశాయి -హ్యూమన్ రైట్స్ వాచ్

బిజెపి విధానాలు దేశంలో హింస, హక్కుల దుర్వినియోగానికి దారితీశాయి -హ్యూమన్ రైట్స్ వాచ్

2023లో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వివక్షత ,విభ‌జన విధానాలు మైనారిటీలపై హింసను పెంచి, భయానక వాతావరణాన్ని సృష్టించాయని, ప్రభుత్వ విమర్శకులపై చట్టవ్యత

అసెంబ్లీలో రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు…స్వంత పార్టీపైనే విమర్శలు
ఈటలపై పైచేయి సాధించిన బండి సంజయ్…వేములవాడలో టెన్షన్ టెన్షన్
తెలంగాణకు జాతీయ పసుపు బోర్డు… ప్రకటించిన ప్రధాని మోడీ

2023లో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వివక్షత ,విభ‌జన విధానాలు మైనారిటీలపై హింసను పెంచి, భయానక వాతావరణాన్ని సృష్టించాయని, ప్రభుత్వ విమర్శకులపై చట్టవ్యతిరేక దాడులకు, దౌర్జన్యాలకు కారణమయ్యాయని హ్యూమన్ రైట్స్ వాచ్ తన ప్రపంచ నివేదిక 2024లో జనవరి 11 (గురువారం) పేర్కొంది.

మోడీ ప్రభుత్వం, నిరంతర వివక్షాపూరిత పద్ధతుల ద్వారా ప్రజల‌ ప్రజాస్వామ్యం ఆకాంక్షలను బలహీనపరిచింది.

“ప్రభుత్వ అధికారులు చట్ట దుర్వినియోగాలకు బాధ్యులనుశిక్షించే బదులు బాధితులను శిక్షించార. ఈ చర్యలను ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ హింసించారు” అని హ్యూమన్ రైట్స్ వాచ్‌లో డిప్యూటీ ఆసియా డైరెక్టర్ మీనాక్షి గంగూలీ అన్నారు.

740 పేజీల ప్రపంచ నివేదిక 2024లో, దాని 34వ ఎడిషన్, హ్యూమన్ రైట్స్ వాచ్ 100 కంటే ఎక్కువ దేశాలలో మానవ హక్కుల పద్ధతులను సమీక్షించింది.

భారత దేశంలో జర్నలిస్టులు, కార్యకర్తలు, విమర్శకులను దాడులు, ఆర్థిక అవకతవకలకు సంబంధించిన అబద్దపు ఆరోపణలు, ప్రభుత్వేతర సంస్థలకు విదేశీ నిధులను నియంత్రించే విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఉపయోగించడం ద్వారా అధికారులువేధించారు.

ఫిబ్రవరిలో, ముస్లింలకు భద్రత కల్పించడంలో ప్రధాని నరేంద్ర మోడీ వైఫల్యాన్ని ఎత్తిచూపిన రెండు భాగాల డాక్యుమెంటరీని ప్రసారం చేసినందుకు ప్రతీకారంగా భారతీయ ఐటీ అధికారులు న్యూఢిల్లీ, ముంబైలోని BBC కార్యాలయాలపై దాడి చేశారు. దేశంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం అత్యవసర అధికారాలను ఉపయోగించి ప్రభుత్వం జనవరిలో భారతదేశంలో BBC డాక్యుమెంటరీని నిరోధించింది.

మతపరమైన, ఇతర మైనారిటీల పట్ల వివక్షాపూరితమైన పద్ధతులను ఎత్తిచూపుతూ ఈ నివేదిక అనేక సంఘటనలను నివేదించింది.

“జూలై 31న, హర్యానా రాష్ట్రంలోని నుహ్ జిల్లాలో ఒక హిందూ ఊరేగింపు సందర్భంగా మతపరమైన హింస చెలరేగింది. ఆ హింస‌ వేగంగా అనేక పక్క జిల్లాలకు వ్యాపించింది. ఈ సంఘట్నల సందర్భంగా వందలాది ముస్లిం ఆస్తులను చట్టవిరుద్ధంగా కూల్చివేయడం, అనేక మంది ముస్లిం పిల్లలను, పురుషులను నిర్బంధించడం ద్వారా అధికారులు ముస్లింలపై ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ సంఘటనపై బిజెపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం “జాతి ప్రక్షాళన” చేస్తోందా అని పంజాబ్ , హర్యానా హైకోర్టు అని ప్రశ్నించిందంటే పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో గమనించవచ్చు.

“ఈశాన్య భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలో, మెజారిటీ మెయిటీ, మైనారిటీ కుకీ జో కమ్యూనిటీల మధ్య మేలో హింస చెలరేగిన తర్వాత, 200 మందికి పైగా మరణించారు, పదివేల మంది స్థానభ్రంశం చెందారు, వందలాది గృహాలు , చర్చిలు ధ్వంసమయ్యాయి. నెలల తరబడి ఇంటర్నెట్ మూసివేయబడింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో కుకీల ప్రమేయం ఉందని , మయన్మార్ నుండి వచ్చిన శరణార్థులకు ఆశ్రయం కల్పించడం ద్వారా కుకీలు విభజనకు ఆజ్యం పోశారని ఆరోపిస్తూ బిజెపి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్, కుకీలను పై తన ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేశారు.

” రాష్ట్ర పోలీసులు పరిస్థితిపై నియంత్రణ కోల్పోయారని ఆగస్టులో, సుప్రీం కోర్టు పేర్కొంది. లైంగిక హింసతో సహా ఇతర‌ హింసల‌పై దర్యాప్తు చేయాలని ప్రత్యేక బృందాలను ఆదేశించింది. సెప్టెంబరులో, డజనుకు పైగా ఐక్యరాజ్యసమితి నిపుణులు మణిపూర్‌లో కొనసాగుతున్న హింస, చట్ట‌ దుర్వినియోగాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిస్పందన సరిగా లేదని ఐక్యరాజ్యసమితి నిపుణులు చెప్పారు, ”అని హ్యూమన్ రైట్స్ వాచ్‌ పేర్కొంది.

జమ్మూ కాశ్మీర్‌లో భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశాలు, ఇతర హక్కులను భారత అధికారులు నిరంతరం పరిమితం చేశారని నివేదిక ఎత్తి చూపింది. భద్రతా బలగాలు చట్టవిరుద్ధమైన హత్యల సంఘటనలు ఏడాది పొడవునా కొనసాగాయి.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పదేళ్లపాటు సాగిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ కనీసం ఆరుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన కేసును కూడా ఇది హైలైట్ చేసింది.

న్యాయం కోసం పోరాడుతున్న సమయంలో, ఒలింపిక్ పతక విజేతలతో సహా మహిళా రెజ్లర్లను భద్రతా దళాలు బలవంతంగా అదుపులోకి తీసుకున్నాయి