HomeTelanganaPolitics

నాకు ఓటు వేయని వాళ్ళను చంపడానికి కూడా వెనకాడను -రాజాసింగ్ హెచ్చరిక‌

నాకు ఓటు వేయని వాళ్ళను చంపడానికి కూడా వెనకాడను -రాజాసింగ్ హెచ్చరిక‌

గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ విద్వేశపూరిత ప్రసంగాలకు పేరుగాంచొనవాడు. ఆయనపై ఎన్ని కేసులు పెట్టినా సరే తను మాత్రం ఇతర వర్గాలను రెచ్చగొట్టే బెదిరి

మేం అధికారంలోకి వస్తే బుల్డోజర్ రాజ్యం తెస్తాం… కిషన్ రెడ్డి హెచ్చరిక‌
తెలంగాణ బీజేపీకి షాక్ – మాజీమంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ రాజీనామా
బీఆరెస్ కు గుడ్ బై-కాంగ్రెస్ లో చేరిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్

గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ విద్వేశపూరిత ప్రసంగాలకు పేరుగాంచొనవాడు. ఆయనపై ఎన్ని కేసులు పెట్టినా సరే తను మాత్రం ఇతర వర్గాలను రెచ్చగొట్టే బెదిరించే ఉపన్యాసాలు మాత్రం మానడు. ఇలాంటి రెచ్చగొట్టే ఉపాన్యాసాలవల్లే బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎన్నికలు రాగానే సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళీ అక్కున చేర్చుకొని టికట్ ఇచ్చింది.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో ఎట్లైనా గెలవాలనుకుంటున్న రాజాసింగ్ సభల్లో ఉపన్యసిస్తున్న తీరు ప్రజల్లో భయాందోళనలకు కారణమ‌తున్నాయి. తన్కు మద్దతివ్వనివారి, తన సమాచారం అవతలి పక్షానికి అందించేవారి అంతు చూస్తానని, హత్యచేయడానికి కూడా వెనకాడనంటూ బెదిరిస్తున్నాడు. ఓ ఎన్నికల సభల్లో ఈ విధంగా ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారాయి.

”2018 ఎన్నికల్లో నాకు ద్రోహం చేశారో అందరి పేర్లతో మా ప్రేమ్ భాయ్ నాకు ఓ చిట్టీ ఇచ్చాడు. వారి పేర్లు చూసి నాకు చాలా బాధకలిగింది. అయితే మా సమాచారం అవతలి పార్టీకి వెల్తున్నప్పుడు వారి సమాచారం మాకు రావడానికి మాకు రాదా ? ఈ ఎన్నికల్లో అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ నేను చేసి పెట్టిన ఎవరెవరు వాళ్ళ్ ఆఫీస్ కు వెళ్తున్నారో, ఎవరు ఏ గల్లీ నుంచి తప్పించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారూ, వాళ్ళ‌కు ఎవరు ఫోన్లు చేసి సమాచారం ఇస్తున్నారో, వాళ్ళ నుంచి ఎవరికి ఫోన్లు వస్తున్నాయో , ఎవరు ఏ హోటల్లో సమావేశాలు పెడ్తున్నారో నాకు అన్నీ తెలుసు. ఎన్నికల తర్వాత వాళ్ళను తలకిందులు, పైకి కాళ్ళు కట్టి వేళ్ళాడదీస్త. ఈ ఎన్నిక నాకు చావుకు, బతుకుకు సంబంధించిన సమస్య. నేను చావడానికి భయపడను, అలాగే ఎవ్వరినైనా చంపడానికి కూడా భయపడను. నాకు ద్రోహం చేయాలనుకున్నవాళ్ళు ఆలోచించుకోండి. నాతో శతృత్వం పెట్టుకుంటే పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నేను శతృవునే వదలను అలాంటిది నా మనుషులను వదులుతనా.” అని రాజాసింగ్ హెచ్చరించాడు.

రాజాసింగ్ మాటలపై ప్రత్యర్థులు తీవ్రంగా స్పంధించారు. రాజాసింగ్ ను ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్ క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

కాగా రాజాసింగ్ మాట్లాడిన వీడియో వైరల్ అవడంతో ఆ వీడియో ఆధారంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.