కాంగ్రెస్ పార్టీకి నిన్న రాజీనామా చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీఆరెస్ లో చేరబోతున్నారు. ఈ రోజు బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్
కాంగ్రెస్ పార్టీకి నిన్న రాజీనామా చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీఆరెస్ లో చేరబోతున్నారు. ఈ రోజు బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పొన్నాల ఇంటికి వెళ్ళి బీఆరెస్ లోకి ఆహ్వానించారు. ఇద్దరి మధ్య చర్చల అనంతరం పొన్నాల బీఆరెస్ లో చేరడానికి అంగీకరించారు.
ఇద్దరి మధ్య చర్చల అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, పొన్నాల బీఆరెస్ లో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. పొన్నాల రేపు ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలుస్తారని , అనంతరం ఈ నెల 16న జనగాం లో జరిగే బీఆరెస్ బహిరంగ సభలో పొన్నాల లక్ష్మయ్య బీఆరెస్ లో చేరతారని కేటీఆర్ అన్నారు.
పొన్నాల కేసీఆర్ ను కలిసాక పొన్నాలక ఏ పదవులు ఇస్తామన్నది తేలుస్తుందని, ఆయనను చాలా గొప్పగా గౌరవించుకుంటామని కేటీఆర్ అన్నారు. అనేక పార్టీలు మార్చిన రేవంత్ రెడ్డి పొన్నాల వంటి సీనియర్ నేతలను అవమానించడం దుర్మార్గమన్నారు.
కాగా ముఖ్యమంత్రిని కలిశాక అన్ని విషయాలు చెప్తానని పొన్నాల మీడియాకు చెప్పారు. ఈ సందర్భంగా పొన్నాల రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన ఆయన తన గురించి నోరుపారేసుకోవడం సిగ్గుచేటన్నారు.