HomeCrimeAndhra Pradesh

వైసీపీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం

వైసీపీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ‌ పై హత్యా ప్రయత్నం జరిగింది. సత్యసాయి జిల్లా గోరంట్లలో ఆయన కారులో వెళ్తుండగా ఓ వ్యక

వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా
వర్మ ‘వ్యూహం’ మూవీకి షాక్ ఇచ్చిన హైకోర్టు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడిగినా మూవీ చేయను , నేను జగన్ అభిమానిని… ఆర్జీవీ

ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ‌ పై హత్యా ప్రయత్నం జరిగింది. సత్యసాయి జిల్లా గోరంట్లలో ఆయన కారులో వెళ్తుండగా ఓ వ్యక్తి ఎమ్మెల్యే కారుపై బాంబు విసిరాడు. అయితే ఆ బాంబు పేలకపోవడంతో ఎమ్మెల్యే తప్పించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

గడప గడప‌కు కార్యక్రమంలో భాగంగా గోరంట్లకు వెళ్ళిన ఎమ్మెల్యేపై ఈ దాడి జరిగింది. ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే కారులో బయలుదేరగానే ఈ బాంబు దాడి జరిగింది.

నిందితుడు సోమందేపల్లి మండలం గుడిపల్లి వాసి గణేశ్ గా గుర్తించామని గోరంట్ల పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో డిటొనేటర్ విసిరినట్టు భావిస్తున్నామని వెల్లడించారు.