HomeTelanganaPolitics

ఈ నెల 16న బీఆరెస్ భారీ బహిరంగసభ, ఆరోజే మేనిఫెస్టో విడుదల

ఈ నెల 16న బీఆరెస్ భారీ బహిరంగసభ, ఆరోజే మేనిఫెస్టో విడుదల

ఈ నెల 16న వరంగల్ లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) భారీ బహిరంగసభ నిర్వహించనుంది. ఆ సభలో బీఆరెస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పా

హర్యాణా మత దాడుల వెనక అసలు కుట్రను బైటపెట్టిన నిజనిర్దారణ బృందాలు
బీజేపీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా – ఎల్లుండి కాంగ్రెస్ లో చేరిక‌
ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన: హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల సంఘం బిజీ సమావేశాలు

ఈ నెల 16న వరంగల్ లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) భారీ బహిరంగసభ నిర్వహించనుంది. ఆ సభలో బీఆరెస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పార్టీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. ఇదే విషయాన్ని బుధవారం మక్తల్‌లో జరిగిన బహిరంగ సభలో హరీశ్‌రావు వెల్లడిస్తూ.. ”కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారు. మా మేనిఫెస్టో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ చేస్తుంది. శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండండి.” అని అన్నారు.

తాము రైతు బంధు, పెన్షన్, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను అద్భుతంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ రోజు ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమన్నారు.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ తెలంగాణలో ఏం చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాట పాడుకునే వారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో బీజేపీ గెలిచేది లేదు, కాంగ్రెస్ నిలిచేది లేదని, మాటల సర్కార్ కావాలా? చేతల సర్కార్ కావాలా? తేల్చుకోవాలన్నారు హరీశ్ రావు. మూడు గంటల విద్యుత్ చాలు అన్న రేవంత్ కావాలా? 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలా? చెప్పాలని ప్రజలను ప్రశ్నించారు హరీశ్. .