HomeTelangana

హైదరాబాద్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర‌ కమిటీ నాయకుడి అరెస్ట్ ?

హైదరాబాద్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర‌ కమిటీ నాయకుడి అరెస్ట్ ?

సీపీఐ మావోయిస్ట్ కేంద్రకమిటీ సభ్యుడు, తమిళనాడు, కేరళ, కర్నాటక, ట్రైజంక్షన్ , పశ్చిమ ఘాట్‌ స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శి సంజయ్‌ దీపక్‌ రావును హైదరాబ

తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
మతోన్మాద వ్యతిరేకి, సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల మావోయిస్ట్ పార్టీ సంతాపం
ప్రభుత్వాల చర్చల పిలుపు మోసపూరితమైనది, అయినా మేము సిద్దమే! అయితే…. మావోయిస్టు పార్టీ ప్రకటన‌

సీపీఐ మావోయిస్ట్ కేంద్రకమిటీ సభ్యుడు, తమిళనాడు, కేరళ, కర్నాటక, ట్రైజంక్షన్ , పశ్చిమ ఘాట్‌ స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శి సంజయ్‌ దీపక్‌ రావును హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం.

మహారాష్ట్ర , థానే జిల్లా అంబర్ నాథ్ కు చెందిన సంజయ్ దీపక్ రావు గతంలో రెండు సార్లు అరెస్టయ్యారు. మహారాష్ట్రలోని ధూలే లోనూ, బెంగళూరులోనూ దీపక్ రావు అరెస్టయ్యి జైలుకు వెళ్ళారు. చాలా కాలం మహారాష్ట్రలో పని చేసిన ఆయన
2019లో పాలక్కాడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నాయకుడు మణివాసగం మరణించిన తర్వాత 2020 సంవత్సరం నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక, ట్రైజంక్షన్, పశ్చిమ ఘాట్ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నారు.
సంజయ్‌ దీపక్‌ రావు అనారోగ్యంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతుండగా పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై తెలంగాణ పోలీసులు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.

సంజయ్‌ దీపక్‌ రావు భార్యను కూడా కర్ణాటకలో పట్టుకున్నారు. పశ్చిమ ఘాట్ కార్యకలాపాలని విస్త్రుతం చేయడం కోసం 2020 నుండి మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సంజయ్ ను అక్కడ నియమించినట్టు తెలుస్తోంది.