HomeTelangana

మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు

మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి సూర్యాపేట జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస

ప్రత్యేక విమానంలో కడపకు బయల్దేరిన షర్మిల, కేవీపీ, రఘువీరారెడ్డి
SBI హైదరాబాద్ సర్కిల్ చే స్వచ్ఛతా హై సేవా 2024
మెట్రో రైలు కొత్త మార్గాలు ఖరారు – ఆమోదం తెలిపిన రేవంత్ రెడ్డి

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి సూర్యాపేట జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా, ఈ ఉదయం 5 గంటల వరకు మహబూబ్‌నగర్‌లోని జానంపేటలో అత్యధికంగా 147.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈరోజు తెల్లవారుజామున భారీ వర్షం కురుసింది. ఇదిలావుండగా, రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రేపు , ఎల్లుండి చాలా చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లోఅలెర్ట్ జారీ చేసింది.

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వరంగల్, హనుమకొండ, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.