HomeTelanganaUncategorized

మహిళల భద్రతకే ప్రథమ లక్ష్యం. . . ఫ్రెండ్లీ పోలీసింగ్ ను పకడ్బందీగా అమలు చేస్తాం. . . నిజామాబాద్ నూతన పోలీసు కమిషనర్ సత్యనారాయణ

మహిళల భద్రతకే ప్రథమ లక్ష్యం. . . ఫ్రెండ్లీ పోలీసింగ్ ను పకడ్బందీగా అమలు చేస్తాం. . . నిజామాబాద్ నూతన పోలీసు కమిషనర్ సత్యనారాయణ

మహిళల భద్రతకే ప్రథమ లక్ష్యం. . . ఫ్రెండ్లీ పోలీసింగ్ ను పకడ్బందీగా అమలు చేస్తాం. . . నిజామాబాద్ నూతన పోలీసు కమిషనర్ సత్యనారాయణనిజామాబాద్ ప్రతినిధి, స

BRS వైపే తెలంగాణ… ‘జనతా కా మూడ్’ సర్వే
ఈ నెల 16న బీఆరెస్ భారీ బహిరంగసభ, ఆరోజే మేనిఫెస్టో విడుదల
10 ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా తెలంగాణకు RSS నాయకుడి రాక‌

మహిళల భద్రతకే ప్రథమ లక్ష్యం
. . . ఫ్రెండ్లీ పోలీసింగ్ ను పకడ్బందీగా అమలు చేస్తాం
. . . నిజామాబాద్ నూతన పోలీసు కమిషనర్ సత్యనారాయణ
నిజామాబాద్ ప్రతినిధి, సెప్టెంబర్ 2(నినాదం న్యూస్) : మహిళలు, చిన్న పిల్లల భద్రతే లక్ష్యంగా పని చేస్తామని నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన వి.సత్యనారాయణ అన్నారు. శనివారం నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ పోలీసు శాఖలో పని చేసిన అనుభవంతో శాంతిభద్రతల పర్యవేక్షణకు పాటుపడుతామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను పకడ్బందీగా అమలు చేస్తామని, మహిళలకు జరిగే వేదింపులను అరికడుతామన్నారు. ఇటీవల కాలంలో సైబర్ క్రైం కేసులు పెరిగిన నేపథ్యంలో దాని కట్టడికి కృషి చేస్తామన్నారు. నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు పోలీసు అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా పని చేసిన కె.ఆర్.నాగరాజు పదవి విరమణ తర్వాత దాదాపు ఐదు నెలల తర్వాత నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా రాచకొండ జాయింట్ కమిషనర్ గా ఉన్న సత్యనారాయణకు పోస్టింగ్ ఇచ్చిన విషయం తెల్సిందే.