భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ
భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బిఆర్ శివప్రసాద్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి దళిత బందును కమిషన్ బంద్ అని భారతీయ జనతా పార్టీ ప్రకటించిందని అది ఈరోజు నిరూపమైందని అనేకమంది నిరుపేద దళితులు బయట మిత్తికి తెచ్చి ఈరోజు ఎమ్మెల్యేలకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కమిషన్ రూపేనా మూడు లక్షల రూపాయలు ఇచ్చారు ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్ లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఎమ్మెల్యేలూ దళిత బందులో కమిషన్ తీసుకుంటునారు అని ప్రకటించి ఆ చిట్టా నా దగ్గర ఉందని చెప్పారు ఆ చిట్టాను ప్రకారం వారి పైన అట్రాసిటీ కేసు పెట్టి వారిని జైల్లో పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు ఉదయ్ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సందీప్ కిసాన్ మోర్చ అధ్యక్షుడు నూతల శ్రీనివాస్ రెడ్డి గారు జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ గారు ఎస్సీ మోర్చా బాధ్యులు పవర్ సాయినాథ్ దేవర్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు