HomeTelanganaUncategorized

బాస్ లకే బాస్… బల్దియాలో స్పెషల్ ఆఫీసర్. రాజ్యమేలుతున్న అక్రమాలు

. అంబటి జోజిరెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మీడియా సమావేశంలోని అంశాలు కరీంనగర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్

Telangana: రాబోయే ఎన్నికల్లో రజాకార్ల సర్కార్ ఓడిపోతుంది, బీజేపీ అధికారంలోకి వస్తుంది -అమిత్ షా
మరి కొద్ది సేపట్లో అభ్యర్థుల అనౌన్స్ మెంట్… బీఆరెస్ లో టిక్కట్ల టెన్షన్… వారి కోసం కవిత పైరవీ
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పంపిణీ పైన మంత్రి కేటీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

.

అంబటి జోజిరెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మీడియా సమావేశంలోని అంశాలు

కరీంనగర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యాలయంలో, రాష్ట్ర ఉపాధ్యక్షులు విలేకరుల సమావేశం నిర్వహించి, కరీంనగర్ స్మార్ట్ సిటీ మునిసిపాల్ కార్పొరేషన్ లోని అవినీతిని ఆధార పత్రాలతో బహిర్గతం చేశారు. స్మార్ట్ సిటీ కరీంనగర్ బల్దియాలో గుత్తాదిపత్యంతో కొంతమంది వ్యవహరిస్తున్నారు. తమ పెత్తనం చెలాయించేందుకు ఎలాంటి వారినైనా వెనక్కి పంపిచేందుకు పావులు కదుపుతూ ఏక చత్రాదిపత్యం చెలాయిస్తున్న పరిస్థితి తయారైంది. లాంగ్ స్టాండింగ్ రాజా అయిన ఆయన 10 ఏళ్లుగా వన్ ఆర్మీగా విధులు నిర్వర్తించేందుకు తప్ప తన పంచన మరోకరిని చేరనిచ్చేందుకు ఒప్పుకోకపోవడానికి కారణమేంటో అర్థం కావడం లేదు. పైగా అతని నిర్ణయాలకు అనుగుణంగానే బల్దియా పెద్దలు కూడా ముందుకు సాగుతుండడం కూడా విస్మయానికి గురి చేస్తోంది. ప్రజలకు సకాలంలో సత్వర సేవలందించాల్సిన శానిటేషన్ విభాగంలోనే ఈ పరిస్థితి ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నాం. మ్యాన్ పవర్ ఎక్కువగా ఉంటే సేవలు విస్తృతంగా అందుతాయి కానీ విధులు నిర్వర్తించేందుకు వచ్చేవారు తిరిగి వెల్లిపోయే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో..? దీని వెనక దాగి ఉన్న విషయం ఏంటో గమనించాలి. కరీంనగర్ కార్పోరేషన్ లో ఐదుగురు శానిటరీ సూపర్ వైజర్లు, ఒక హెల్త్ ఆఫీసర్, పోస్టులు ఉన్నప్పటికీ ఇక్కడ అన్నీ పోస్టులు ఖాళీ ఉన్నాయి. జిల్లా కేంద్రంతో పాటు ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువుగా ఉన్న కరీంనగర్ లో పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్న భ్రమలు కల్పిస్తున్నా బల్దియా యంత్రాంగం వ్యవహారమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నాను. ఇందులో విచిత్రం ఏంటంటే హెల్త్ ఆఫీసర్ పోస్టు మంజూరీ అయినా దానిని భర్తీ చేయకుండా హెడ్ ఆఫీసులోని పెద్ద తలల సహకారంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే కరీంనగర్ ప్రజలపై వీరికి ఏ పాటి మమకారం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక వేళ ఎవరైనా ఇక్కడకు పోస్టింగ్ అయి వస్తే మాత్రం సోలో రోల్ పాటించే బాస్ కనుసన్నల్లో బ్రతకలేమని భావించి బదిలీ చేయించుకోవల్సిన పరిస్థితి తయారైందంటే ఆయన వెనక ఉన్న పవర్ ఏంటో అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ శాఖకు సూపరింటిండెంట్ ఉన్నప్పటికీ ఆర్టీఐ దరఖాస్తులకు రిప్లైపై సంతకాలు కూడా ఈయనే చేస్తారంటే ఈయన చెప్పు చేతల్లో ఈ విభాగం ఏ స్థాయిలో చిక్కుకుందో అర్థం చేసుకోవచ్చు. తన ఇష్టారాజ్యం నడవాలంటే కార్పోరేటర్లను కూడా తనకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. అవసరం లేకున్నా, మంజూరీకి మించి సపాయి కార్మికులను నియమించుకునే ప్రక్రియకు కూడా తెరలేపి బల్దియా నిధులను వృధా చేస్తున్నారు. కార్పోరేషన్ ఖజానాకు తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తు… 100 నుండి 120 మంది కార్మికులను నియమించుకున్నారు. వీరి పేరిట రూ. 20 లక్షల వరకు వేతనాలు డ్రా చేస్తూ వీరిలో కొందరిని కార్పోరేటర్లు, ప్రజా ప్రతినిధుల ఇండ్లలో పని చేయడానికో, కార్పోరేటర్ల వాహనాల డ్రైవర్లకో వినియోగించుకుంటుండడం ఎంతవరకు సమంజసమో నగర ప్రజలు ఆలోచించాలి. ప్రజా సేవ చేస్తామంటూ ప్రగల్భాలు పలికి గెలిచి బల్దియాను సంస్కరించే ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన వారే ఇలా తమ వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం బల్దియా నిధులను దుర్వినియోగం చేస్తున్నతీరుపై మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజలకు సేవలందించేందుకు కార్మికులను నియమించుకుంటూ ప్రజా ప్రతినిధుల అవసరాల కోసం వారిని వినియోగించుకుంటున్న విధానానికి స్వస్తి పలకాల్సిందేనని హెచ్చరిస్తున్నాం. ఇంధన వినియోగం గురించి కూడా మునిసిపాలిటీలో పట్టించుకునే వారు లేకుండా పోయారా..? వాహనాల ట్రాకింగ్ సిస్టంను తొలగించి వాహనాలు నడిచినట్టుగా అడ్గగోలుగా డిజిల్ బిల్లులు పెడుతున్నా కట్టడి చేసే వారు లేరంటే కరీంనగర్ కార్పోరేషన్ లో ఏం జరుగుతోందో పాలకులకు అర్థం అవుతోందా…? ఉన్నతాధికారులు ఈ తతంగంపై దృష్టి సారిస్తున్నారా… అన్నదే మిస్టరీగా మారిపోయింది. అంతేకాకుండా బల్దియా నిధులతో ప్రైవేటు చెత్త ట్రాక్టర్లలో డిజీల్ పోయించి ట్రాక్టర్ యజమానుల వద్ద కూడా ఈయన డబ్బులు వసూలు చేస్తున్నాడని మా దృష్టికి వచ్చింది. అంటే ఆయన ఏ స్థాయిలో చక్రం తిప్పుతున్నారో కరీంనగర్ ప్రజలు గమనించాలని కోరుతున్నాను. అర్హత లేకున్నా అసిస్టెంట్ కమీషన్ ఇంఛార్జి పోస్ట్ ను పొందిన సదరు అధికారి ప్రభావం ఏ స్థాయికి చేరిందంటే, 15వ ఆగస్టు నాడు ప్రభుత్వ యంత్రాంగానికి ఇచ్చే ఉత్తమ సేవల అవార్డు జాబితాలో ఆయన పేరు లేకున్నా ప్రత్యేకంగా పిలిచి మరి ఇచ్చారు. అంటే ఆయనపై జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు ఉన్న ప్రత్యేక మమకారం ఏంటో అర్థం చేసుకోవచ్చు. మీడియా వాళ్లకు కూడా నెలనెలా మామూళ్లు ఇస్తున్నాను నన్నేం చేయలేరు అంటూ వ్యాఖ్యానించే సదరు అధికారి వ్యతిరేక శక్తులన్నింటిని కూడా తన గుప్పిట దాచుకున్నాని చెప్పకనే చెప్తున్నారు. డ్యూటీకి రాకున్నా ఎందుకు రాలేదని ప్రశ్నించే సాహసం ఆయన పై అధికారి కూడా చేయడం లేదంటే ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తున్న పెద్దలు ఎవరో గమనించాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ అనుచరులతో సెటిల్ మెంట్లు, ప్రత్యేకంగా ఓ క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేసుకున్న ఈ సారు గురించి చెప్తే చాతాడంత అవుతుంది. సి డి ఎం ఏ & ఆర్ డి ఎం ఏ విభాగంలోని కొంతమంది దివ్య ఆశీస్సులు ఆయనగకి ఉండడంతో ఆయనను ఇక్కడి నుండి బదిలీ చేసే ప్రతిపాదన కూడా రావడం లేదు. దీనికి తోడు బల్దియాతో పాటు కరీంనగర్ లో అధికారపార్టీలో కీలక భూమిక పోషిస్తున్న నాయకుల అండదండలు కూడా ఆయనగారికి పుష్కలంగా ఉండడంతో ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా తయారైంది. నగరంలో స్వేచ్ఛగా తిరుగుతున్న దోమలను కట్టడి చేసే ఫాగింగ్ మిషన్ వాహనాలు తిరగవు కాని ఇందుకు సంబంధించిన ఖర్చుల బిల్లుల దస్త్తాలు మాత్రం సిద్దం అవుతూనే ఉంటాయి, నిధులు సాంక్షన్ అవుతూనే ఉంటాయి. ఇందు కోసం ఒక్కో వాహనం పేరిట రోజుకు రూ. 13 వేల వరకూ డబ్బులు డ్రా అవుతున్నాయంటే కరీంనగర్ కార్పోరేషన్ లో ఏం జరుగుతోందో అర్థం చేసుకోవద్దు. అవినీతిని ప్రశ్నించిన వారికి తాయిలాలు కూడా ఇచ్చే ఈ పెద్దసారు గురించి పూర్తి వివరాలతో కూడిన ఫిర్యాదును ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తయారు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతులను రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ వింగ్, డిపార్ట్ మెంట్ విజిలెన్స్ , విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాలకు పంపిస్తాం అని అంబటి జోజిరెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, విలేకరుల సమావేశంలో నిర్వహించి విలేఖరులకు వివరిస్తూ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ జిల్లా అధ్యక్షుడు, కొక్కిరాల సత్యా రావ్, చొప్పదండి నియోజకవర్గం ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల విజయ్ కుమార్, ఏఐఎఫ్ బి చొప్పదండి నియోజకవర్గం కన్వీనర్ పెద్దెల్లి శేఖర్ కొక్కిరాల సత్యరావ్

………………బాస్ లకే బాస్… బల్దియాలో స్పెషల్ ఆఫీసర్…