HomeNationalCrime

బుల్డోజర్ రాజ్యం: ఐసీయూలోకి బూట్లతో రావద్దన్నందుకు ఆస్పత్రిని కూల్చేందుకు బుల్డోజర్ పంపిన మేయర్

బుల్డోజర్ రాజ్యం: ఐసీయూలోకి బూట్లతో రావద్దన్నందుకు ఆస్పత్రిని కూల్చేందుకు బుల్డోజర్ పంపిన మేయర్

ఉత్తరప్రదేశ్ లో తమకు నచ్చని ఆస్తులపైకి బుల్డోజర్లు పంపడం బీజేపీ పాలకులకు అలవాటుగా మారిపోయింది. అలా ఇప్పటికే వందలాదిమంది ఆస్తులు ధ్వంసం చేశారనే ఆరోపణల

ABP-C ఓటర్ సర్వే : తెలంగాణలో కాంగ్రెస్ దే విజయం
బండి సంజయ్ కి కీలక పదవి – ప్రకటించిన నడ్డా
ఇండియానా లేక భారతా? పేరు మార్చడం సరి కాదని 2016లో సుప్రీంకోర్టుకు చెప్పిన మోడీ సర్కార్

ఉత్తరప్రదేశ్ లో తమకు నచ్చని ఆస్తులపైకి బుల్డోజర్లు పంపడం బీజేపీ పాలకులకు అలవాటుగా మారిపోయింది. అలా ఇప్పటికే వందలాదిమంది ఆస్తులు ధ్వంసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తన ఇగో హర్ట్ చేశారని లక్నో మేయర్ ఏకంగా ఓ ఆస్పత్రిపైకే బుల్డోజర్ పంపారు.

లక్నో మునిసిపల్ కార్పొరేషన్‌లోని ఆర్మీ బ్రిగేడ్ నుండి రిటైర్డ్ సైనికుడు సురేన్ కుమార్ అనారోగ్యంతో థానా బిజ్నౌర్‌లో ఉన్న వినాయక్ మెడికేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటంతో డాక్టర్లు అతన్ని ICU లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఆస్పత్రిలో ఉన్న సురేన్ కుమార్ ను చూడడానికి లక్నో మేయర్ సుష్మ ఖరక్ వాల్ తన అనుచరులతో ఆస్పత్రికి వచ్చారు. వాళ్ళంతా బూట్లు వేసుకొని ICUలోకి వెళ్తుండగా అక్కడున్న సిబ్బంది. బూట్లు బైట విడిచి లోపలికి వెళ్ళాలని సూచించారు. అది పట్టించుకోని మేయర్ అలాగే ICUలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. దాంతో అడ్డుకున్న సిబ్బంది బూట్లతో ఐసీయూలోకి వెళ్ళడం లోపలున్న రోగులకు ప్రమాదమని అభ్యర్థించారు. దాంతో కోపంతో ఊగిపోయిన మేయర్, తాను మేయర్ నని తననే అడ్డుకుంటారా అని సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఇగో హర్టయిన ఆమె తన పవరేంటో చూపించాలనుకున్నారు. మీ అంతు చూస్తానంటూ హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

ఆమె వెళ్ళిన కొద్ది సేపటికే ఆస్పత్రి అక్రమ నిర్మాణమని దీనిని కూల్చి వేస్తున్నామంటూ ఆ ఆస్పత్రి గోడలపై మున్సిపల్ సిబ్బంది నోటీసులు అంటించారు. ఆ వెంటనే ఆస్పత్రిని కూల్చడానికి బుల్డోజర్ వచ్చింది. ఆస్పత్రి సిబ్బంది బతిమాలుతున్నా వినకుండా ఆస్పత్రిని కూల్చడానికి రెడీ అయిపోయారు.

ఈ గొడవతో అక్కడికి చేరుకున్న పోలీసులు మేయర్ కు నచ్చజెప్పారు. ఇరు వర్గాల మధ్య సయోధ్యకుదిర్చారు.

మేయర్, ఆమె పరివారం బూట్లు ధరించి ICUలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని, అతితే శానిటరీ మార్గదర్శకాలను అమలు చేయాలని వారికి సూచించడంతో మేయర్ కు కోపం వచ్చిందని ఆసుపత్రి పరిపాలన పేర్కొంది. అయితే, ఆసుపత్రి డైరెక్టర్ ముద్రికా సింగ్ ఈ వాదనలను ఖండించారు. మేయర్ ఖరక్వాల్ వాస్తవానికి ఆసుపత్రిని సందర్శించి వైద్య సిబ్బందితో సంభాషించారని, అయితే తమ మధ్య ఎలాంటి గొడవ‌ జరగలేదని పేర్కొంది.

అయితే ఈ వ్యవహారమంతా చూసిన చుట్టుపక్కలవాళ్ళు, ఆస్పత్రి సిబ్బంది మేయర్ అహంకార ప్రవర్తనపై మండిపడుతున్నారు. ఈ సంఘటనను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా బీజేపీ నాయకులపై విమర్శల వర్షం కురుస్తోంది.