HomeNationalCrime

పోలీసులు నేరాలను అరికట్టడానికి పంచాంగాన్ని ఫాలో కావాలని డీజీపీ ఆదేశం

పోలీసులు నేరాలను అరికట్టడానికి పంచాంగాన్ని ఫాలో కావాలని డీజీపీ ఆదేశం

నేరాలను అదుపు చేయడానికి, నేరస్తులను పట్టు కోవడానికి పోలీసులు ఈ రోజుల్లో టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అయినప్పటికీ నేరాలు ఆగడం లేదు కాబట్టి ఇకపై హిం

తెల్లవారుజాము నుండే బీఎస్పీ నాయకుల అరెస్టులు…
చోరీకి వెళ్ళి బ్యాంకును ప్రశంసలతో ముంచెత్తి వెనక్కి వెళ్ళిపోయిన దొంగ‌
‘కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్’ వ్యవహారం రచ్చ రచ్చ…కలగజేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

నేరాలను అదుపు చేయడానికి, నేరస్తులను పట్టు కోవడానికి పోలీసులు ఈ రోజుల్లో టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అయినప్పటికీ నేరాలు ఆగడం లేదు కాబట్టి ఇకపై హిందూ పంచాంగాన్ని అనుసరించాలని ఉత్తరప్రదేశ్ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

యూపీలోని పోలీసులందరి దగ్గర తప్పకుండా పంచాంగం ఉండాలని, ఆ పంచాంగాన్ని ఫాలో అయ్యి నేరాలను అరికట్టాలని యూపీ డిజీపీ విజయ్ కుమార్ ఓ సర్క్యులర్ జారీ చేశారు.

14న జారీ చేసిన ఈ సర్క్యులర్‌లో ఇలా ఉంది: “రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో… ప్రధాన కార్యాలయాల స్థాయిలో జరిగిన సంఘటనలను విశ్లేషించినప్పుడు, హిందూ క్యాలెండర్ న్నాము. సీనియర్ పోలీసు అధికారుల స్థాయిలో ప్రతి నెలా ఈ విశ్లేషణ జరగాలి. పంచాంగం కాపీ సర్క్యులర్‌కు జోడించబడింది.

ఆగస్టు 16, సెప్టెంబరు 14, అక్టోబర్ 14 తేదీల్లో అమావాస్య వస్తుందని, దానికి వారం ముందు, తర్వాత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

ఈ కాలంలో జరిగే నేరాలను మ్యాప్ చేయాలని, హాట్‌స్పాట్‌లను గుర్తించి పెట్రోలింగ్‌ను పెంచాలని సర్క్యులర్‌లో ఆదేశించారు.

“ప్రభావవంతమైన నేరాల నివారణ అనేది పోలీసుల ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటి. పటిష్టమైన పోలీసింగ్ ద్వారా రాష్ట్రంలోని సామాన్య పౌరులలో భద్రతతో కూడిన వాతావరణం నెలకొల్పాలి. దీని కోసం, రాత్రి పెట్రోలింగ్ మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది, తద్వారా సాధారణ ప్రజలు తమ భద్రతపై విశ్వాసం కలిగి ఉంటారు.” అని డీజీపీ తన ఆదేశాలలో పేర్కొన్నారు.

రాత్రి పూట అది కూడా అమవాస్యకు ముందూ, వెనకా జరిగే నేరాలకు ఈ పంచాగం బాగానే పనికి వస్తుంది కానీ ఇతర రోజుల్లో, పగటి పూట జరిగే నేరాలు అరికట్టడానికి ఈ పంచాంగాన్ని ఎలా ఉపయోగించాలో డీజీపీ తన ఆదేశాల్లో వివరించలేదు. ఒక్క అమవాస్య ఎప్పుడన్నది తెలుసుకోవడానికి మాత్రమే పోలీసులు పంచాగాన్ని జేబులో పెట్టుకొని తిరగాలా లేక అన్ని సమయాల్లో నేరాలకు పంచాగంలో పరిష్కారాలు ఉన్నాయా అనేది డిజీపీ చెప్పాల్సి ఉంది.