బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ విప్లవాత్మక విధానాలతో యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నది. సం
బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ విప్లవాత్మక విధానాలతో యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నది. సంపూర్ణ పరివర్తనతోనే దేశంలో గుణాత్మక మార్పు సాధ్యమని, పరివర్తన సాధించడమే తమ దీర్ఘకాలిక లక్ష్యమని ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు దేశ ప్రజలు ముందుకువస్తున్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో ఉద్యమించేందుకు ఒక్కొక్కరుగా కదలి వస్తున్న తీరు దేశ సమకాలీన రాజకీయాలను ప్రభావితం చేస్తున్నది.
వందలాదిగా సర్పంచుల చేరిక :
బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మహారాష్ట్ర పల్లెలు కదిలివస్తున్నాయి. తెలంగాణ లో అమలవుతున్న రైతు బలహీన దళిత పేద వర్గాలకు తెలంగాణ లో అమలవుతున్న పలు పథకాలు తమకూ అమలు చేయాలని తద్వారా తమ జీవితాల్లో గుణాత్మక మార్పు చోటుచేసుకోవాలనే బలమైన ఆకాంక్షతో మహారాష్ట్ర సర్పంచులు బిఆరెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే వందలాది గ్రామాల సర్పంచులు చేరిన నేపథ్యంలో సోమవారం నాడు మరో వందమందికి పైగా సర్పంచులు సిఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. మహారాష్ట్ర బుల్ధానా జిల్లా కు చెందిన సర్పంచులు, వార్ధా జిల్లా లోని అనేక గ్రామాల నుంచి సర్పంచులు వందలాదిగా బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
వీరిలో….
బుల్ధానా జిల్లా అమరావతి డివిజన్ కు చెందిన పలు గ్రామాలకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు మధూరి యోగష్ ఫర్ఫత్ (మురాంబా గ్రామం) , రమేష్ రాంభావు వాఘ్ (గుగ్లి గ్రామం), సచిన్ ప్రభాకర్ మహాజన్ (అంట్రి గ్రామం), జితేంద్ర భగవత్ షిండే (మహాలుంగి), మహాదేవ్ వామన్ తాయ్దే (సరోలా పిర్ గ్రామం), అమోల్ అరున్ ప్రధాన్ (తక్కీ ఘడేకర్ గ్రామం), ధన్ రాజ్ మనోజ్ ఖుండ్ (జావ్లా పరస్ ఖేడ్), అంజద్ ఖా అహ్మద్ ఖా పఠాన్ (అంబషి గ్రామం), అనిల్ భగవాన్ బోడేడ్ (గవ్హాన్ గ్రామం), సదానంద్ సారంగధర్ పుండేకర్ (ఏయూల్ఖేడ్ గ్రామం) ఇంకా అనేక మంది సర్పంచులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
బిఆర్ఎస్ ను ఆదిరిస్తున్న మహారాష్ట్ర మహిళా లోకం :
ఈ క్రమంలో… బిఆర్ఎస్ పార్టీ విధానాలను నచ్చి మహారాష్ట్ర నుంచి పలు వర్గాలకు చెందిన ప్రజలు నేతలు మేధావులతో నిరంతరాయంగా చేరికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో సోమవారం జరిగిన చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ మేరకు ‘ఛత్రపతి శాసన్ మహిళా అగాడి’ బిఆర్ఎస్ పార్టీలో విలీనమైంది. మహిళల చైతన్యం హక్కుల సాధనకోసం ఏర్పాటయిన ఈ సంఘంలో మహారాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది కార్యకర్తలున్నారు. వీరు జిల్లాలు తాలుకాల వ్యాప్తంగా కార్యాచరణ చేపట్టి మహిళాభ్యుదయం దిశగా పనిచేస్తున్నారు. ఛత్రపతి శాసన మహిళా అగాడి’ అధ్యక్షురాలు దివ్య మేగ్దుం తన అనుచరులతో పాటు సోమవారం హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి గులాబీ కండువాలు కప్పి అధినేత సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శాసన మహిళా అగాడి అధ్యక్షురాలు దివ్య మగ్గం మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీ విధానాలను మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి, కేంద్రంలో కిసాన్ సర్కార్ ను అధికారంలోకి తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు.
వీరితో పాటు నాగ్ పూర్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ సంఘటన్ మంత్రి అనిల్ లిచ్చదే, కాంగ్రెస్ పార్టీ నగర ప్రెసిడెంట్ రమన్ బేలే, ఆర్ పిఐ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ సంజయ్ బోర్కర్, శివసేన పార్టీ సెక్రటరీ సరిత కోల్హే, ఆర్ పిఐ పార్టీ ఆర్గనైజర్ మహేంద్ర బోర్డే, శివసేన పార్టీ వార్డు ఉపాధ్యక్షుడు అరవింద్ నక్షతే, కాంగ్రెస్ పార్టీ వార్డు సచివ్ దీపక్ కోల్హే; అమరావతి గ్రామానికి చెందిన బిఎస్ పి పార్టీ వార్డు అధ్యక్షుడు నదేష్ అంబేద్కర్; వార్ధా కు చెందిన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు పవన్ తిజారే తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
సైంటిస్టులు మేధావుల చేరిక :
అదే విధంగా వార్ధా జిల్లా హింగన్ ఘాట్ పట్టణానికి చెందిన ప్రముఖులు సైంటిస్ట్ డాక్టర్ ఉమేష్ ఎస్ వావేర్ సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. డాక్టర్ ఉమేష్ సర్పంచ్ గా సేవలందించడంతో పాటు ఎమ్మెల్యేగా పోటీచేశారు. అదే విధంగా నాగ్ పూర్ వాసి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రొఫెసర్ జావిద్ పాషా బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చి సిఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ పలువురు ప్రముఖులతో కలిసి వారు వచ్చారు.
వీరితో పాటు మహారాష్ట్రలోని పలు జిల్లాల నుంచి వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర బిఆర్ఎస్ ఇంచార్జీ కల్వకుంట్ల వంశీధర్ రావు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాల చారి తదితరులున్నారు.