HomeTelangana

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు అంత ఖర్చా ?

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు అంత ఖర్చా ?

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సంధర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 21రోజులు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. అందుకు భారీగానే నిధులు ఖర్

హైదరాబాద్ ప్రజలకు రెడ్ అలర్ట్
దేశ ఔన్నత్యాన్ని చాటుతూ తెలంగాణ ప్రగతికి అద్దం పట్టిన వజ్రోత్సవాలు
BRS వైపే తెలంగాణ… ‘జనతా కా మూడ్’ సర్వే

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సంధర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 21రోజులు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. అందుకు భారీగానే నిధులు ఖర్చు పెట్టారని ప్రచారం ఉంది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల వివరాలు, ఖర్చుల వివరాలను తెలుసుకునేందుకు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. ఆర్టీఐ దరఖాస్తుకు ప్రణాళికా శాఖ సంయుక్త సంచాలకులు కె. రవిందర్ జిల్లాల వారీగా కేటాయించిన నిధుల వివరాలను అందజేసారని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. అయితే ఇందులో హైదరాబాద్ లో పెట్టిన ఖర్చు వివరాలు, ఇతర రాష్ట్రాల, జాతీయ పత్రికలకు ఇచ్చిన ప్రకటనల ఖర్చు లేదు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి ప్రణాళికా శాఖ ద్వారా విడుదల చేసిన మొత్తం 105 కోట్లు అని తెలిపారు.

జిల్లాల వారీగా కేటాయింపులు

ఆదిలాబాద్ ‍ 3కోట్ల‌38 లక్షలు
కొమ్రభీం ‍ 2కోట్ల‌54 లక్షలు
మంచిర్యాల ‍ 2కోట్ల‌70 లక్షలు
నిర్మల్ ‍ 3కోట్ల‌14 లక్షలు
ఖమ్మం ‍ 4కోట్ల‌81 లక్షలు
భద్రాద్రి కొత్తగూడెం – 3కోట్ల‌68 లక్షలు
కరీంనగర్ – 3కోట్ల‌12 లక్షలు
జగిత్యాల – 3కోట్ల‌07 లక్షలు
పెద్దపల్లి – 2కోట్ల‌40లక్షలు
రాజన్న సిరిసిల్ల – 2కోట్ల‌16 లక్షలు
హన్మకొండ – 1కోటి 95 లక్షలు
వరంగల్ – 2కోట్ల‌60 లక్షలు
జనగాం – 2కోట్ల‌45 లక్షలు
భూపాలపల్లి – 1కోటి70 లక్షలు
ములుగు – 1కోటి27 లక్షలు
మహబూబాద్ – 3కోట్ల‌22 లక్షలు
మహబూబ్ నగర్ – 3కోట్ల‌37 లక్షలు
నారాయణపేట – 2కోట్ల‌56 లక్షలు
గద్వాల్ – 2కోట్ల‌82 లక్షలు
నాగర్ కర్నూల్ – 4కోట్ల‌46 లక్షలు
వనపర్తి – 2కోట్ల‌30 లక్షలు
నిజామాబాద్ – 4కోట్ల‌35 లక్షలు
కామారెడ్డి – 4కోట్ల‌08 లక్షలు
రంగారెడ్డి – 5కోట్ల‌02 లక్షలు
మేడ్చల్ – 1కోటి86 లక్షలు
వికారాబాద్ – 4కోట్ల‌18 లక్షలు
మెదక్ – 3కోట్ల‌16 లక్షలు
సంగారెడ్డి – 5కోట్ల‌06 లక్షలు
సిద్దిపేట – 4కోట్ల‌42 లక్షలు
సూర్యాపేట – 3కోట్ల‌72 లక్షలు
భువనగిరి – 3కోట్ల‌28 లక్షలు

హైదరాబాద్ జిల్లా ఖర్చుల సమాచారం మాత్రం ఇవ్వలేదు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 6 కోట్ల‌17 లక్షలు ఖర్చు పెట్టగా, అతి తక్కువ ఖర్చు ములుగు జిల్లాలో 1కోటి27 లక్షలు మాత్రమే పెట్టారని ప్రభుత్వం ఇచ్చిన సమాచారం హక్కు చట్టం సమాచారంలో ఉందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి, కొన్నె దేవేందర్, కానుగంటి రాజు, కొమటి రమేశ్ బాబు, గంగాధర్, జి. హరిప్రకాశ్, బి. రాజేశ్ తెలిపారు.