HomeTelanganaPolitics

జగ్గారెడ్డిని BRS లో చేర్చుకుంటే మూకుమ్మడి రాజీనామాలు… ఆ పార్టీ నేతల వార్నిం గ్

జగ్గారెడ్డిని BRS లో చేర్చుకుంటే మూకుమ్మడి రాజీనామాలు… ఆ పార్టీ నేతల వార్నిం గ్

సంగారెడ్డి ఎమ్మెల్యే MLA జగ్గారెడ్డి Jagga Reddy కాంగ్రెస్ Congress కు గుడ్ బై చెప్పి బీఆరెస్ లో చేరబోతున్నాడనే వార్తలు కొంతకాలంగా చక్కర్లు కొడుతున్న

ABP-C ఓటర్ సర్వే : తెలంగాణలో కాంగ్రెస్ దే విజయం
తెలంగాణ రాజకీయాల్లోకి కల్వకుంట్ల మూడో తరం.. సామాజిక కార్యక్రమాలతో మొదలు..
తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్ ల యుద్దం

సంగారెడ్డి ఎమ్మెల్యే MLA జగ్గారెడ్డి Jagga Reddy కాంగ్రెస్ Congress కు గుడ్ బై చెప్పి బీఆరెస్ లో చేరబోతున్నాడనే వార్తలు కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. జగ్గా రెడ్డి కూడా ఈ వార్తలను ఖండించకపోగా కేసీఆర్ KCR, హరీష్ రావు Hareesh Rao లను పొగుడుతూ మాట్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి Sangareddy నియోజకవర్గ బీఆరెస్ BRSనాయకులు రగిలిపోతున్నారు. ఎన్నో ఏళ్ళుగా తాము జగ్గారెడ్డితో పోరాడుతున్నామని అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి తమపై రుద్దితే సహించబోమని హెచ్చరిస్తున్నారు.

సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఎంపీపీలు, జెడ్ పీటీసీలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్ ల తో సహా దాదాపు 200 మందికి పైగా బీఆరెస్ నేతలు నిన్న హరీష్ రావును కలిసి జగ్గారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనీ పార్టీలో చేర్చుకోవద్దని, ఒకవేళ చేర్చుకున్నా ఎమ్మెల్యే టికట్ ఇవ్వొద్దని కోరారు.

గత ఎన్నికల్లో బీఆరెస్ తరపున పోటీ చేసిన‌ చింతా ప్రభాకర్ ఓటమి పాలైనప్పటికీ ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని, ఈ సారి మళ్ళీ ఆయనకే టికట్ ఇస్తే గెలిపించుకుంటామని నాయకులు హరీష్ రావుకు స్పష్టం చేశారు.

ఒక వేళ జగ్గారెడ్డికి బీఆరెస్ టికట్ ఇస్తే మూకుమ్మడి రాజీనామాలు తప్పవని ఆశ్ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. గత నెలలో కూడా నియోజకవర్గంలోని బీఆరెస్ నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యి జగ్గారెడ్డికి టికట్ ఇవ్వొద్దంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.